ప్రముఖ గాయని లతా మంగేష్కర్ అస్తమయం
Legendary singer Lata Mangeshkar passes away at 92. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఈరోజు కన్నుమూశారు. జనవరి 8న ఆమెకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలిన తర్వాత ముంబైలోని బ్రీచ్ కాండీ
By అంజి Published on 6 Feb 2022 4:22 AM GMT
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఈరోజు కన్నుమూశారు. జనవరి 8న ఆమెకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలిన తర్వాత ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో చేరారు. ఆమె గత రెండు వారాలుగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఇటీవల ఆమె ఆరోగ్యంలో మెరుగుదల సంకేతాలు కనిపించడంతో, ఆమె ఆరోగ్య పరిస్థితి మళ్లీ క్షీణించింది. కరోనా ద్వారా న్యూమోనియా కూడా అటాక్ అయింది. అయితే.. గతనెల చివరిలో లత ఆరోగ్యం మెరుగుపడుతోందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. కరోనా, న్యూమోనియా నుంచి కోలుకున్నట్లు వెల్లడిచారు. అయితే.. మరో సారి ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. దురదృష్టవశాత్తు ఈరోజు ఆమె కన్నుమూసింది. ఆమె మరణవార్త తెలుసుకున్న యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది.
లతా మంగేష్కర్ 92వ ఏట మరణించారు
కొన్ని రోజులుగా, లతా మంగేష్కర్ ఆరోగ్యంలో మెరుగుదల నిరంతర సంకేతాలను చూపుతున్నారు. ఆమె కోసం ప్రార్థించమని ప్రతి ఒక్కరినీ కోరుతూ ఆమె బృందం కూడా ముందుకు వచ్చింది. ఆసుపత్రిలో వారాల తరబడి పోరాడిన తరువాత, లతా మంగేష్కర్ ఈ రోజు మరణించారు. లతా మంగేష్కర్ ప్లేబ్యాక్ సింగింగ్‌లో ఒక లెజెండ్. ఆమె ఏడు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో సంగీత రత్నాలను అందించింది. ఆమె అసాధారణ ప్రతిభకు, భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో సహా లెక్కలేనన్ని అవార్డులతో ఆమెను సత్కరించారు. 13 ఏళ్ల వయస్సులో లతా మంగేష్కర్ తన కెరీర్‌ను ప్రారంభించారు. ఏడు దశాబ్దాల కెరీర్‌లో 50 వేలకు పైగా పాటలు పాడారు. గాన కోకిలగా పేరు పొందారు. 2001వ సంవత్సరంలోనే భారత అత్యున్నత పురస్కారమైన భారత రత్న పురస్కారం దక్కింది. వేల పాటలు పాడిన లతా మంగేష్కర్‌ను నైటింగల్ ఆఫ్ ఇండియాగా కీర్తిస్తుంటారు.