లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ కేసులో కీలక పరిణామం..!
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జైలు ఇంటర్వ్యూకు సంబంధించి డీఎస్పీ గుర్షేర్ సింగ్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు.
By Medi Samrat Published on 6 Jan 2025 2:59 PM ISTగ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జైలు ఇంటర్వ్యూకు సంబంధించి డీఎస్పీ గుర్షేర్ సింగ్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. గుర్షేర్ సింగ్‌పై చర్యకు గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత.. హోం కార్యదర్శి గురుకీరత్ కిర్పాల్ సింగ్ తొలగింపు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. గుర్షేర్ సింగ్ విదేశాలకు పరారీ కావడంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. గత వారంలోనే హోం శాఖ డీఎస్పీని తొలగించిన ఫైలును పంజాబ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు పంపింది. గుర్షేర్ సింగ్‌ను తొలగించే పని ప్రారంభించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది.
డీఎస్పీ గుర్షేర్ సింగ్ గతేడాది అక్టోబర్ నుంచి సస్పెన్షన్‌లో ఉన్నారు. లారెన్స్ ఇంటర్వ్యూ విషయంలో.. కిందిస్థాయి అధికారులపై తీసుకున్న చర్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పంజాబ్ ప్రభుత్వాన్ని హైకోర్టు మందలించింది. సీనియర్ అధికారులను రక్షించేందుకే కిందిస్థాయి అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లు హైకోర్టు పేర్కొంది.
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో ఇంటర్వ్యూ మార్చి 2023లో ప్రసారం చేయబడింది. ఈ ఇంటర్వ్యూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఈ ఇంటర్వ్యూ ఒక ప్రైవేట్ ఛానెల్‌లో ప్రసారమైన సమయంలో లారెన్స్ CIA ఖరార్ కస్టడీలో ఉన్నాడు. ఈ కేసును డీఎస్పీ గుర్షేర్ సింగ్ కేసు దర్యాప్తు చేపట్టారు. 2022లో జరిగిన పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యలో లారెన్స్ కీలక పాత్ర పోషించాడు. ఈ కేసులో పంజాబ్ పోలీసులు విచారణ నిమిత్తం లారెన్స్‌ను తీహార్ జైలు నుంచి ట్రాన్సిట్ రిమాండ్‌పై తీసుకొచ్చారు.
ఇంటర్వ్యూ కేసులో దోషులైన అధికారులపై చర్యలు తీసుకోవడానికి హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది, అయితే మొదట కింది స్థాయి అధికారులపై చర్య తీసుకోవాలని సిఫార్సు చేసింది. దీనిపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీని తర్వాత.. ఇటీవల పంజాబ్ పోలీసులు అఫిడవిట్ ఇచ్చారు. ఈ కేసులో డీఎస్పీ గుర్షేర్ సింగ్‌పై చర్యలు తీసుకుంటున్నట్లు హైకోర్టుకు తెలియజేశారు.
పంజాబ్ ప్రభుత్వ అధికారుల ప్రకారం.. DSP గుర్షేర్ సింగ్‌ను తన వైపు నుంచి హాజరు కావాలని కోరింది. అయితే అతడు దర్యాప్తుకు సహకరించలేదు. ఆయన ఇంటికి నోటీసులు కూడా పంపినా రాలేదు. అనంతరం డీఎస్పీని విధుల నుంచి తప్పించారు.