లవ్ జిహాద్.. అయిదేళ్ళు జైలులో ఉంచుతారట..?

Law Against Love Jihad Soon. లవ్ జిహాద్.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పదం ఇది. ప్రేమించి.. పెళ్లి చేసుకోడానికి

By Medi Samrat  Published on  17 Nov 2020 1:21 PM GMT
లవ్ జిహాద్.. అయిదేళ్ళు జైలులో ఉంచుతారట..?

లవ్ జిహాద్.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పదం ఇది. ప్రేమించి.. పెళ్లి చేసుకోడానికి మతమార్పిడులకు పాల్పడడం.. ఈ లవ్ జిహాద్ అంశం మీద పెద్ద చర్చ జరిగింది.. జరుగుతోంది కూడానూ..! ఇలాంటి పరిస్థితుల్లో లవ్ జిహాద్ ను అరికట్టడానికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు సంచలన నిర్ణయాలు తీసుకోడానికి ముందుకు వస్తున్నాయి. వివాహం కోసం మతమార్పిడి చేసుకోవడం ఆమోదయోగ్యం కాదన్న అలహాబాద్‌ కోర్టు వ్యాఖ్యలతో కర్ణాటక, హరియాణా, బీజేపీ వంటి పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు లవ్‌ జిహాద్‌ను కట్టడి చేసేందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామంటూ ప్రకటనలు చేశాయి.

అందులో భాగంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓ అడుగు ముందుకు వేసింది. లవ్‌ జిహాద్‌ను అరికట్టడం కోసం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక బిల్లు ప్రవేశపెడతామని ఆ రాష్ట్ర‌ హోంమంత్రి నరోత్తం మిశ్రా అన్నారు. పెళ్లి పేరుతో మత మార్పిడికి పాల్పడితే నాన్‌ బెయిల్‌ కేసులు నమోదు చేసి, ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించేలా చట్టం తీసుకొస్తామని.. లవ్‌ జిహాద్‌కి సహాయం చేసిన వారికి కూడా ప్రధాన నిందితుడితో సమానంగా శిక్ష ఉంటుందని చెప్పుకొచ్చారు. బలవంత మత మార్పిడుల కోసం పవిత్రమైన వివాహ ధర్మాన్ని అడ్డు పెట్టుకోవడం దుర్మార్గమని అన్నారు. పెళ్లి కోసం స్వచ్చందంగా మతం మారాలని భావించే వారు.. నెల రోజుల ముందుగానే కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకోబోతున్న ఈ నిర్ణయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇతర రాష్ట్రాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.


Next Story