లోయ‌లో ప‌డ్డ బ‌స్సు.. ఐదుగురు దుర్మ‌ర‌ణం

జార్ఖండ్ రాష్ట్రం లతేహర్ జిల్లా మహుదంద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓర్సా వ్యాలీలో బస్సు బోల్తా పడింది.

By -  Medi Samrat
Published on : 18 Jan 2026 5:21 PM IST

లోయ‌లో ప‌డ్డ బ‌స్సు.. ఐదుగురు దుర్మ‌ర‌ణం

జార్ఖండ్ రాష్ట్రం లతేహర్ జిల్లా మహుదంద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓర్సా వ్యాలీలో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చాలా మంది మరణించినట్లు నివేదికలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి మనోజ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనా స్థలానికి అంబులెన్స్ కూడా బయలుదేరింది. పెద్ద సంఖ్యలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. క్షతగాత్రులతో మహుదండ్ల ప్రభుత్వ ఆసుపత్రి నిండిపోయింది. సమాచారం ప్రకారం, బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తులు ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ నుండి లోధ్ ఫాల్‌కు వెళ్తున్నారు. ఒక్కసారిగా లోయలో బస్సు బోల్తా పడడంతో పెద్ద ఎత్తున అరుపులు వినిపించాయి.

అందిన సమాచారం ప్రకారం బస్సులో 80 మంది ఉన్నారు. ఇప్పటి వరకు ఐదుగురు మహిళల మృతదేహాలను వెలికి తీశారు. బస్సు కింద మరిన్ని మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉంది. కొందరు బస్సు కింద సమాధి అయినట్లు సమాచారం. బస్సు బోల్తా పడిన తరువాత ప‌లువురు వాలంటీర్లు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు చేరుకున్నారు. క్షతగాత్రులకు చికిత్స చేయడంలో వైద్యులకు సహకరిస్తున్నారు. బల్‌రాంపూర్‌లోని జ్ఞాన్ గంగా హైస్కూల్‌కు చెందిన స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది.

Next Story