పహల్గామ్ ఉగ్రవాద దాడికి మొదట బాధ్యత వహించిన లష్కరే తోయిబా శాఖ అయిన ది రెసిస్టెన్స్ ఫోర్స్ (TRF), దీనికి, తమకు ఎటువంటి సంబంధం లేదని ఖండించింది. పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి జరిగిన కొన్ని రోజుల తర్వాత, TRF Xలో పోస్ట్ పెట్టింది. పహల్గామ్‌లో పర్యాటకులపై దాడి తమ పని కాదని తమ వ్యవస్థ,లను భారత్ హ్యాక్ చేసినట్లు అందులో తెలిపింది.
పహల్గామ్ దాడిని టీఆర్‌ఎఫ్‌కు ఆపాదించడం తొందరపాటు చర్యే అవుతుందని, ఇంతకుముందు వచ్చిన ప్రకటనతో కూడా మాకు ఎలాంటి సంబంధం లేదని ది రెసిస్టెన్స్ ఫోర్స్ తెలిపింది. భారత్ మా వ్యవస్థల్ని హ్యాక్ చేసి ఆ సందేశాన్ని పోస్ట్ చేసిందని చెప్పింది. రాజకీయ ప్రయోజనాల కోసం భారత్ ఇలా చేయడం ఇదేమీ మొదటిసారి కాదని టీఆర్‌ఎఫ్ ఆరోపించింది. "పహల్గామ్‌లో దాడి జరిగిన కొద్దిసేపటికే, మా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకదాని నుండి ఒక సంక్షిప్త సందేశం పోస్ట్ చేశారు. అంతర్గత ఆడిట్ తర్వాత, ఇది సైబర్ చొరబాటు ఫలితంగా జరిగిందని మేము నమ్ముతున్నాం” అని TRF నోటీసులో ఉంది.