బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇండియా కూటమి నాయకత్వ మార్పు విఝయమై మమతా బెనర్జీకి మద్దతు పలికారు. కాంగ్రెస్ అభ్యంతరంలో అర్థం లేదని ఆయన అన్నారు. మమతా బెనర్జీకి మద్దతిస్తాం.. మమతా బెనర్జీకి నాయకత్వం (ఇండియా కూటమి) ఇవ్వాలి. బిహార్‌లో 2025లో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యాత్రకు వెళ్తున్నారా అని లాలూ యాదవ్‌ను ప్రశ్నించగా.. తాను యాత్రకు వెళ్లడం లేదని లాలూ యాదవ్ బదులిచ్చారు.
శరద్ పవార్ కూడా మమతా బెనర్జీకి మద్దతిచ్చారు. పవార్ మాట్లాడుతూ.. అవును, ఖచ్చితంగా (కూటమికి నాయకత్వం వహించగల సామర్థ్యం ఆమెకు ఉంది), ఆమె ఈ దేశంలోని ప్రముఖ నాయకురాలు అని ఆయన అన్నారు. ఆమెకు ఆ సామర్థ్యం ఉందన్నారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడిన సీఎం మమతా బెనర్జీ.. కూటమి నాయకత్వం, సమన్వయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నేనే ఇండియా బ్లాక్‌ని ఏర్పాటు చేశానని.. ఇప్పుడు దానిని నడిపించే వారిపై ఆధారపడి ఉందన్నారు. వారు దానిని కొనసాగించలేకపోతే.. నేను ఏమి చేయగలను? అందరినీ వెంట తీసుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను చెప్పేది ఒక్కటేనన్నారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇండియా కూటమి ఏర్పడింది. ఇండియా కూటమికి మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఈ కూటమి రూపురేఖలను నిర్ణయించేందుకు నాలుగు సమావేశాలు జరిగాయి.