కృష్ణా జలాల వివాదం.. డిసెంబర్ 13న సుప్రీంకోర్టు విచారణ

Krishna river water dispute tribunal hearing is on december 13th. డిసెంబర్‌ 13వ తేదీన కృష్ణా ట్రైబ్యునల్‌ అంశంపై దాఖలైన పిటిషన్లపై భారత ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ జరపనున్నది.

By అంజి  Published on  29 Nov 2021 2:41 PM IST
కృష్ణా జలాల వివాదం.. డిసెంబర్ 13న సుప్రీంకోర్టు విచారణ

డిసెంబర్‌ 13వ తేదీన కృష్ణా ట్రైబ్యునల్‌ అంశంపై దాఖలైన పిటిషన్లపై భారత ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ జరపనున్నది. కాగా కృష్ణా జలాల వివాద ట్రైబ్యునల్‌ ఫైనల్‌ నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వ అధికారిక గెజిట్‌లో ప్రచురించాలని కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై సోమవారం విచారణ జరిగింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్‌ న్యాయవాది.. ప్రతి స్పందన కోసం రెండు వారాల గడువు కావాలని కోర్టును కోరారు. ఈ మేరకు డిసెంబర్‌ 13వ తేదీన విచారణ చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొంది.

కృష్ణా ట్రైబ్యునల్‌ ఉత్తర్వులు, గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల పై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టనుంది. జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ ఈ పిటిషన్లను విచారణ చేస్తుంది. ఈ సందర్భంగా వాదనలు వివరాలు ఇవ్వాలని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాలు 3 పేజీలకు మించకుండా వాదనల వివరాలు ఇవ్వాలని పేర్కొంది. అలాగే విచారణకు 48 గంటలలోపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కర్నాటక తరపున వాదనలు చేసిన న్యాయవాది శ్యామ్ దివాన్ మాట్లాడుతూ.. 16 - 09 - 2011 నాటి సుప్రీం కోర్టు తీర్పు గెజిట్‌లో న్యాయపరమైన ఉత్తర్వులను ప్రచురించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అడ్డుకుంటున్నదని అన్నారు. కానీ అంతర్జాతీయ జల వివాదాల చట్టంలోని ఆర్టికల్ 6 ప్రకారం న్యాయపరమైన నిర్ణయాలు సుప్రీంకోర్టు డిక్రీకి సమానంగా ఉన్నాయని, వాటిని గెజిట్‌లో వెంటనే ప్రచురించడానికి అనుమతించిందని ఆయన వాదించారు. తెలంగాణ న్యాయవాది సి. ఎస్. వైద్యనాథన్ ఈ కేసులో వివరణాత్మక వాదనను కోరారు. నాలుగు రాష్ట్రాలు డిసెంబర్ 13న మధ్యాహ్నం 2.00 గంటలకు తమ వాదనలోని ప్రధానాంశాలను మూడు పేజీల నోట్‌తో విచారించనున్నాయి.

Next Story