లాక్ డౌన్ లో ఎంతో మంది పెళ్లిళ్లు చేసుకుంటూ ఉన్నారు. ముందే కుదిరిన ముహూర్తాలు కొన్నైతే.. అనుకోకుండా జరుగుతున్న పెళ్లిళ్లు కొన్ని ఉన్నాయి. ఎక్కువ మంది పెళ్లికి హాజరవ్వడానికి అవకాశం లేకపోవడంతో ఆన్ లైన్ లోనే చూసుకోండి అంటూ యూట్యూబ్ లింక్ లు పెడుతూ ఉన్నారు. లాక్ డౌన్ లో పెళ్లిళ్లు చేసుకుంటున్న వాళ్ళ విషయంలో ఓ యువకుడు సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేశాడు. అదేమిటంటే ఒకే ముహూర్తానికి ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు.
ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం ముళబాగులలో చోటు చేసుకుంది. ఆ యువకుడు ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం వెనుక ఓ కథ ఉంది. వరుడు ఉమాపతి సుప్రియ, లలితలను పెళ్లి చేసుకున్నాడు. సుప్రియ, లలితలు అక్క చెల్లెల్లు. ఒకరు మూగ కాగా, మరొకరు చెవిటి వారు.. తోడుగా ఒక దగ్గరే ఉండాలని ఆ అమ్మాయిల తల్లిదండ్రులు భావించారు. అందు కోసం ఎన్నో సంబంధాలు చూసారు. వరుడు ఉమాపతి మాత్రం సుప్రియ, లలితాలను పెళ్లి చేసుకోడానికి ఒప్పుకున్నాడు. దీంతో లాక్ డౌన్ లో అతి తక్కువ మంది సమక్షంలో మే 7న వారి పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.