ఖలిస్తానీ నాయకుడు, వారిస్ పంజాబ్ డి చీఫ్ అమృతపాల్ సింగ్‌ను శనివారం జలంధర్‌లోని నకోదర్ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వేర్పాటువాద నేతపై పంజాబ్ పోలీసులు పలు అభియోగాలు మోపారు. పరిస్థితి దృష్ట్యా పంజాబ్ ప్రభుత్వంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. అతని సహాయకులలో ఆరుగురిని గతంలో జలంధర్‌లో అదుపులోకి తీసుకున్నారు. వారిని గుర్తు తెలియని ప్రదేశంలో ప్రశ్నిస్తున్నారు.
పంజాబ్ పోలీసులు షాకోట్ సమీపంలో అమృతపాల్ సింగ్ దాక్కున్న ప్రదేశాన్ని కనుగొంది. ఈ ఉదయం ఖలిస్తానీ నాయకుడు, అతని సహాయకులను అరెస్టు చేసే ప్రయత్నంలో 50కి పైగా పోలీసు వాహనాలు వెంబడించాయి. పంజాబ్‌లోని పలు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఈ ఆంక్షలు రేపటి వరకు కొనసాగుతాయి. పంజాబ్ పరిధిలో అన్ని మొబైల్ ఇంటర్నెట్ సేవలు, అన్ని SMS సేవలు (బ్యాంకింగ్, మొబైల్ రీఛార్జ్ మినహా) మార్చి 19 వరకు నిలిపివేశామని అధికారులు తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని పంజాబ్ హోం వ్యవహారాలు, న్యాయ శాఖ తమ ఉత్తర్వుల్లో తెలిపింది.