పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితుల్లో ఒకరైన గ్యాంగ్‌స్టర్ దీపక్ పోలీసుల అదుపు నుంచి తప్పించుకున్నట్లు అధికారిక వర్గాలు ఆదివారం తెలిపాయి. మూసేవాలా హత్య కేసులో కీలక నిందితుడు దీపక్ అలియాస్ టిను పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. గత రాత్రి మాన్సా జిల్లాలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరో కేసులో దర్యాప్తు కోసం వారెంట్‌పై గ్యాంగ్‌స్టర్ దీపక్‌ను సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిబ్బంది శనివారం రాత్రి 11 గంటల సమయంలో కపుర్తలా జైలు నుంచి మాన్సాకు తరలిస్తున్నారు. ప్రైవేట్ వాహనంలోనే దీపక్‌ని తీసుకెళ్తండగా.. అర్ధరాత్రి తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు.
సిద్ధూ మూసేవాలా హత్య కేసులో మరో నిందితుడైన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి దీపక్ సన్నిహితుడు. మే 29, 2022న పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో సిద్ధూ మూసేవాలాగా పేరుగాంచిన సింగర్ శుభదీప్ సింగ్ సిద్ధూను హత్య చేశారు. స్నేహితుడు, బంధువుతో కలిసి జీపులో మాన్సాలోని జవహర్ కే గ్రామానికి సిద్ధూ వెళ్తుండగా ఆరుగురు షూటర్లు అతడిపై కాల్పులు జరిపారు. లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు గోల్డీ బ్రార్ ఈ హత్యకు బాధ్యత వహించారు. పారిపోయిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు బటిండా రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ముఖ్విందర్ సింగ్ తెలిపారు. హత్య తర్వాత, లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యులను పట్టుకునే పనిలో పంజాబ్ పోలీసులు ఉన్నారు. హత్యకేసులో ఛార్జ్ షీట్ వేసిన 24 మంది నిందితుల్లో టినూ కూడా ఉన్నాడు.