ప్రేయసిని 10 సంవత్సరాలు ఇంట్లోనే దాచి.. ఇప్పుడు పెళ్లి..

Kerala Man Who Had Hidden His Lover In His Room For Ten Years Finally Marries Her. కేరళలో తన ప్రియరాలిని 10 సంవత్సరాలుగా ఇంట్లోనే దాచిన

By Medi Samrat  Published on  16 Sep 2021 6:15 AM GMT
ప్రేయసిని 10 సంవత్సరాలు ఇంట్లోనే దాచి.. ఇప్పుడు పెళ్లి..

కేరళలో తన ప్రియరాలిని 10 సంవత్సరాలుగా ఇంట్లోనే దాచిన యువకుడికి సంబంధించిన వార్త కొన్ని నెలల కిందట వైరల్ అయింది. రెహమాన్ అనే వ్యక్తి ప్రియురాలు సజితాను ఏకంగా పదేళ్లపాటు తన ఇంట్లోనే ఓ గదిలో ఎవరికీ తెలియకుండా దాచిపెట్టాడు.. ఇప్పుడు ఆమెను చట్టపబద్ధంగా పెళ్లి చేసుకున్నాడు. కేరళలోని పాలక్కాడ్ జిల్లా నెన్ మారా పట్టణంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రత్యేక వివాహ చట్టం కింద బుధవారం ఈ పెళ్లి జరిగింది.

పాలక్కాడ్ జిల్లా అయిలూర్ కు చెందిన రెహమాన్ తన ప్రియురాలిని తన ఇంటి ప్రాంగణంలోనే ఓ గదిలో పదేళ్లపాటు రహస్యంగా దాచి పెట్టాడు. చట్ట విరుద్ధంగా యువతిని నిర్భంధించాడంటూ కేరళ రాష్ట్ర మహిళా కమిషన్ అతడి మీద కేసు పెట్టింది. 2010 ఫిబ్రవరి 2 న పాలక్కాడ్ జిల్లాలోని అలియూర్ అనే పల్లెలో వేలాయుధన్ అనే వ్యక్తి 18యేళ్ల తన కుమార్తె సజిత కనపడటం లేదని పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడు. పోలీసులు వెంటనే సజితను వెతకడం ప్రారంభించారు. ఆ ఊళ్లో ఉన్న కుర్రాళ్లను పిలిచి ఎంక్వైరీ చేశారు. ఆమె కనిపించలేదు. ఆమె చనిపోయిందనే నిర్థారణకు వచ్చారు. రేషన్ కార్డులో ఆమె పేరు కూడా తీసేశారు. కానీ ఆమె బతికే ఉంది. ఆమె ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఇంట్లో చెప్పకుండా ఆ అబ్బాయితో వెళ్ళిపోయింది. ఆమె కోసం ఎక్కడెక్కడో గాలించినా ఆచూకీ లభించలేదు. పదేళ్ల తర్వాత 'మీ అమ్మాయి దొరికింది' అని చెప్పారు. ఆ అమ్మాయితో పాటు పక్కింటి కుర్రాడు కూడా ఉన్నాడు.

ఆ అమ్మాయి మరెక్కడికో లేచిపోలేదని పక్కింటికే వెళ్లిందని తెలుసుకున్నారు. అబ్బాయి తల్లిదండ్రులకు కూడా విషయం తెలియనంతగా గోప్యత పాటించారు ఆ ప్రేమికులు. తన ప్రియురాలిని ఎవరికీ తెలియకుండా తమ ఇంట్లో తన గదిలో ఉంచేశాడు. అన్న పానీయాలు తనే అందించే వాడు. తను గదిలో ఉంటే లోపల గడియ పెట్టుకునే వాడు.. లేకపోతే.. బయట తాళం వేసేవాడు. ఆ గదికి అటాచ్డ్‌ బాత్‌రూమ్‌ కూడా లేకపోవడంతో ఆ అమ్మాయి రాత్రి వేళ కిటికీ నుంచి బయటకు దూకి బాత్‌రూమ్‌కి వెళ్లేదని తెలిపారు. మూడు నెలల క్రితం ఆ అబ్బాయి గదిలోని తన ప్రియురాలిని తీసుకుని ఇల్లు వదిలి పారిపోయాడు. అదే ఊళ్లో మరో ఇల్లు అద్దెకు తీసుకుని ఇద్దరూ సహజీవనం చేశారు. ఇప్పుడు వాళ్లు పెళ్లి చేసుకున్నారు.

Next Story
Share it