ఈ యాప్‌లో మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఇతర సర్టిఫికేట్లను భద్రంగా దాచుకోండిలా..

Keep your Certificates safely on Digilocker. డిజిటల్‌ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా డీజీలాకర్‌ అనే యాప్‌ను రూపొందించింది. ఇందులో ముఖ్యమైన సర్టిఫికేట్లు, ఇతర డాక్యుమెంట్లను దాచుకోవచ్చు.

By Medi Samrat  Published on  21 March 2021 10:15 AM GMT
Keep your Certificates safely on Digilocker,
ఆధార్‌ కార్డు, పాన్‌కార్డు అనేది ఈ రోజుల్లో తప్పనిసరి అయిపోయింది. ఆధార్‌ ప్రతి దానిలో ఉపయోగపడేది. ఇది లేనిది పనులు జరగని పరిస్థితి. అయితే సాధారణంగా కొందరు ఆధార్‌ గానీ, పాన్‌ కార్డు గాని ఇంట్లో పెట్టుకుంటారు. అత్యవసర సమయంలో వెంటనే లేకపోతే సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దాదాపు అన్ని రకాల లావాదేవీలకు తప్పకుండా అవసరమే. మరి ఈ ఆధార్‌, పాన్‌ కార్డులు ఒక్క సమయంలో అవసరానికి దొరకవు. అప్పుడు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అత్యవసరం ఉన్న సమయంలోనే ఒక్కడ వెతికినా దొరకవు.


అయితే ఇలాంటి ఇబ్బందులను పడకుండా కేంద్ర ప్రభుత్వం 2015లో వర్చువల్‌ లాకర్‌ను ప్రారంభించింది. కేంద్ర ఎలక్ట్రానిక్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వశాఖ డిజిటల్‌ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా డీజీలాకర్‌ అనే యాప్‌ను రూపొందించింది. ఇందులో ముఖ్యమైన సర్టిఫికేట్లు, ఇతర డాక్యుమెంట్లను సైతం భద్రంంగా దాచుకోవచ్చు. అలాగే ఆధార్‌, పాన్‌ కార్డులతో పాటు డ్రైవింగ్‌లైసెన్స్‌, వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ తదితర పత్రాలు ఇందులో అప్‌లోడ్‌ చేసుకుని భద్రంగా ఉంచుకోవచ్చు. ఏదైనా సమయంలో అధికారులు తనిఖీ చేస్తే ఒరిజినల్‌ మీ దగ్గర లేకిపోతే వెంటనే ఈ యాప్‌లో అప్‌లోడ్‌ చేసిన వాటిని ఆస్కారం ఉంటుంది.

అయితే మీ డాక్యుమెంట్లను దాచుకోవాలంటే ముందుగా డిజీలాకర్‌లో మీ అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవాలి. https://digilocker.gov.in/ వెబ్‌సైట్ లేదా డిజీలాకర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ ద్వారా అకౌంట్‌ను క్రియేట్‌ చేసుకుని డాక్యుమెంట్లను ఇందులో భద్రపర్చుకోవచ్చు. మీ యూజర్‌ నేమ్‌, పాస్‌ర్డ్‌ ద్వారా అకౌంట్‌ చేసుకుని డాక్యుమెంట్లన్నీ దాచుకోవచ్చు.

అంతేకాదు జేపీఈజీ,పీడీఎఫ్‌,పెన్‌జీ లాంటి ఫార్మాట్‌లో ఉన్న డాక్యుమెంట్లను సైతం స్మాన్‌ చేసి అప్‌లోడ్‌ చేసుకోవచ్చు కూడా. పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ మాత్రమే కాకుండా ప్రభుత్వం జారీ చేసిన వివిధ రకాలా సర్టిఫికేట్లు, ఇతర డాక్యుమెంట్లను ఈ డీజీలాకర్‌లో భద్రంగా పెట్టుకోవచ్చు రైలులో ప్రయాణించే సమయంలో లేదా ట్రాఫిక్‌ పోలీసులు మీ వాహనాలను తనిఖీ చేసిన సమయంలో మీ ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లాంటివి ఈ డీజీలాకర్‌లో చూపించుకోవచ్చు.

ఈ సదుపాయం ఎంతో ఉపయోగపడుతుంది. ఎవరైన ఈ వాహనం తనిఖీ చేసిన సమయంలో గానీ, ఎక్కడైన ఒరిజినల్‌ సర్టిఫికేట్లు చూపించాలని అడిగిన సమయంలో గానీ ఇది ఈ యాప్‌ ద్వారా చూపించుకోవచ్చు. సమస్య అనేది ఎదురు కాదు.


Next Story