ఢిల్లీలో పార్టీ కార్యాలయం నిర్మాణ పనులను పరిశీలించిన కేసీఆర్
KCR inspected the construction work of party office in Delhi
By Medi Samrat
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. పర్యటన నేటికి రెండో రోజు కాగా.. నేడు ఆయన బిజిబిజీగా గడిపారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పనులు ఎలా సాగుతున్నాయనే అంశాలను పరిశీలించిన గులాబీ బాస్ కేసీఆర్.. దీనిపై పలు సూచనలు చేశారు. మూడు అంతస్థుల్లో నిర్మాణమవుతున్న ఈ భవనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన సీఎం కేసీఆర్.. పలు మార్పులు కూడా సూచించారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు తదితరులు ఉన్నారు.
ఇదిలావుంటే.. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిన్న సీఎం కేసీఆర్ సందర్శించారు. గ్యారమూర్తి రోడ్లోని ఎస్పీ మార్గ్లో ఉన్న కేత్రి ట్రస్ట్ భవనాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏడాది పాటు లీజుకు తీసుకుంది. కేటీఆర్ ఢిల్లీ టూర్ సందర్భంగా అగ్రిమెంట్ జరిగింది. వసంత్ కుంజ్లో టీఆర్ఎస్ భవన్ నిర్మాణంలో ఉన్నందున బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు ఇక్కడి నుంచే కొనసాగనున్నాయి. ఈ నెల 5న టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకుంది. నిన్న ఉదయం సీఎం కేసీఆర్.. ఎస్పీ అధినేత, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు కూడా హాజరయ్యారు.