కథక్ లెజెండ్ పండిట్ బిర్జు మహారాజ్.. గుండెపోటుతో మృతి

Kathak maestro Pandit Birju Maharaj passes away. కథక్ లెజెండ్ పండిట్ బిర్జు మహారాజ్ గుండెపోటుతో ఆదివారం అర్థరాత్రి ఢిల్లీలోని తన స్వగృహంలో మరణించారు.

By అంజి
Published on : 17 Jan 2022 8:16 AM IST

కథక్ లెజెండ్ పండిట్ బిర్జు మహారాజ్.. గుండెపోటుతో మృతి

కథక్ లెజెండ్ పండిట్ బిర్జు మహారాజ్ గుండెపోటుతో ఆదివారం అర్థరాత్రి ఢిల్లీలోని తన స్వగృహంలో మరణించారు. ఆయన వయసు 83. తన మనవళ్లతో ఆడుకుంటుండగా బిర్జుకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. పండిట్‌ బిర్జు దేశంలోని రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ పొందాడు. పండిట్‌ బ్రిజ్ మోహన్ నాథ్ మిశ్రాగా ఫిబ్రవరి 4, 1937న ఒక ప్రసిద్ధ కథక్ నృత్య కుటుంబంలో జన్మించాడు.

అతని మేనల్లుడు, శిష్యుడు పండిట్ మున్నా శుక్లా 78 ఏళ్ళ వయసులో స్వల్ప అనారోగ్యంతో మరణించిన కొద్ది రోజులకే ఈ వార్త వచ్చింది. పండిట్ బిర్జు మహారాజ్ తన జీవితకాలంలో అనేక అవార్డులు పొందాడు. అతను కథక్ నర్తకిగా ప్రసిద్ధి చెందినప్పటికీ, గాయకుడు, కవి, చిత్రకారుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. బాలీవుడ్‌ కొన్ని సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పని చేశారు. పండిట్‌ బిర్జూ గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. బిర్జూ తన తండ్రి అచ్చన్‌ మహరాజ్‌ వద్దే సంప్రదాయ నృత్యాన్ని నేర్చుకున్నారు. డమ్స్‌లను వాయించడంలోనూ బిర్జూ ప్రజ్ఙాశాలి.



Next Story