సంచలన నిర్ణయం తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం..!

Karnataka proposes One Percent reservation for transgenders in government jobs. కర్ణాటక ప్రభుత్వం ఊహించని నిర్ణయం తీసుకుంది.

By Medi Samrat  Published on  22 July 2021 7:13 AM GMT
సంచలన నిర్ణయం తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం..!

కర్ణాటక ప్రభుత్వం ఊహించని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు ఒకశాతం రిజర్వేషన్ కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వంనిర్ణయం తీసుకుంది. ఈ విధానం అమల్లోకి తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా రికార్డులకెక్కింది. రిజర్వు కానిస్టేబుల్, బ్యాండ్స్‌మెన్ ఉద్యోగ నియామకాల్లో ట్రాన్స్‌జెండర్లకు అవకాశం కల్పించకపోవడంపై సంగమ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిల్‌పై కర్ణాటక హైకోర్టులో వాదనలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది మాట్లాడుతూ రిజర్వేషన్ల విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు ఒకశాతం రిజర్వేషన్ కల్పించినట్టు చెప్పారు. ట్రాన్స్‌జెండర్ల కోటా విషయంలో కేంద్రం ఎలాంటి నిబంధనలు అమలు చేయబోతోందో రెండు వారాల్లోగా చెప్పాలని ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది.

ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్ కల్పించటానికి అమలు చేయటానికి 1977 లో కర్ణాటక సివిల్ సర్వీసెస్ జనరల్ రిక్రూట్మెంట్ (రూల్స్) కు సవరణలు చేసినట్లు చీఫ్ జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా , జస్టిస్ సూరజ్ గోవిందరాజ్ ల డివిజన్ బెంచ్ కు సమాచారం ఇచ్చింది ప్రభుత్వం.ట్రాన్స్ జెండర్లు కూడా సాధారణ వ్యక్తులవంటివారేనని వారికి కూడా అందరిలా సమాన జీవించే హక్కు ఉందని ప్రభుత్వం భావించిందని ఈ సందర్భంగా ధర్మాసనానికి ప్రభుత్వం వివరించింది.


Next Story