మహిళను చెంపదెబ్బ కొట్టిన మంత్రి

Karnataka minister slaps woman. కర్ణాటక మంత్రి సోమన్న ఆదివారం చామ్‌రాజ్‌నగర్ జిల్లాలోని హంగాలా గ్రామంలో భూమి పట్టాల పంపిణీ

By Medi Samrat  Published on  23 Oct 2022 10:33 AM GMT
మహిళను చెంపదెబ్బ కొట్టిన మంత్రి

కర్ణాటక మంత్రి సోమన్న ఆదివారం చామ్‌రాజ్‌నగర్ జిల్లాలోని హంగాలా గ్రామంలో భూమి పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఒక మహిళను చెంపదెబ్బ కొట్టడం కెమెరాలో రికార్డ‌య్యింది. తనకు భూమి పట్టా రాలేదంటూ ఓ మహిళ తన బాధను చెప్పుకునేందుకు మంత్రి వ‌ద్ద‌కు వ‌చ్చింది. కోపంతో ఉన్న మంత్రి ఆమెను చెంపదెబ్బ కొట్టాడు. అయితే వీడియోలో మహిళ దాడికి గురైన‌ప్ప‌టికి మంత్రి పాదాలను తాకడం, ఆయ‌న‌ ఆశీర్వాదం కోరడం కనిపిస్తుంది. ఈ ఘ‌ట‌న కెమెరాల‌లో రికార్డ‌య్యి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది.

అయితే, కర్ణాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ మంత్రి సోమన్న తనను చెప్పుతో కొట్టారని కెంపమ్మ అనే మహిళ ఖండించింది. మంత్రి తనను ఓదార్చారని, ఇంట్లో ఇతర దేవుళ్లతో పాటు తాను మంత్రిని పూజిస్తానని ఆమె చెప్పారు. కెంపమ్మ అనే మహిళ ఈ విషయాన్ని ఖండించింది. మంత్రి సోమ‌న్న‌ చెంపదెబ్బ కొట్టారు. మంత్రి తనను ఓదార్చారని, ఇంట్లో ఇతర దేవుళ్లతో పాటు తాను మంత్రిని పూజిస్తానని ఆమె చెప్పారు.

నాది చాలా నిరుపేద కుటుంబం. భూమి కేటాయించి సాయం చేయమని ఆయన కాళ్లపై పడి అడిగాను. అందుకే నన్ను ఓదార్చారు.. కానీ నన్ను చెప్పుతో కొట్టారని దుష్ప్రచారం చేస్తున్నారు' అని కెంపమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయ‌న‌ మాకు భూమి ఇచ్చారు. మేము చెల్లించిన రూ. 4,000 కూడా ఆయ‌న‌ తిరిగి ఇచ్చారు. మేము ఆయ‌న‌ ఫోటోను వేవుళ్లు, దేవతలతో పాటు ఉంచాము. మేము ఆయ‌న‌ని ఇంట్లో పూజిస్తామని పేర్కొంది.

ఈ ఘటనపై స్పందించిన కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌.. మంత్రిని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రాహుల్ గాంధీ సెప్టెంబరు 30న అదే కర్నాటక గుండ్లుపేట నుంచి భారత్ జోడో యాత్రను ప్రారంభించిన విధానానికి ఎంత‌ తేడా? అని ప్ర‌శ్నించారు.



Next Story