ఒమిక్రాన్ ఎఫెక్ట్ : న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు
Karnataka govt imposes restrictions on New Year celebrations. ఒమిక్రాన్ ముప్పు కారణంగా పలు రాష్ట్రాలలో నూతన సంవత్సరం 2022 వేడుకలపై
By Medi Samrat Published on 21 Dec 2021 8:48 PM IST
ఒమిక్రాన్ ముప్పు కారణంగా పలు రాష్ట్రాలలో నూతన సంవత్సరం 2022 వేడుకలపై ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. కర్ణాటక ప్రభుత్వం కూడా తాజాగా నూతన సంవత్సరం 2022 వేడుకలపై ఆంక్షలు ప్రకటించింది. చర్చిలలో క్రిస్మస్ వేడుకలు, ప్రార్థన సమావేశాలపై ఎటువంటి ఆంక్షలు ఉండవని తెలిపింది. బెలగావిలోని సువర్ణ విధాన సౌధలో తన క్యాబినెట్ సహచరులు, ఆరోగ్య శాఖ సీనియర్ అధికారులు, కోవిడ్ నిపుణులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన తర్వాత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. డిసెంబర్ 30 నుండి జనవరి 2 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.
"కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు MG రోడ్, బ్రిగేడ్ రోడ్‌లో సహా అన్ని బహిరంగ సభలు కర్ణాటక అంతటా నిషేధించబడ్డాయని, రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ బహిరంగ వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాలు ఉండవు" అని బొమ్మై చెప్పారు. "ఇప్పటి లాగే 50 శాతం ఆక్యుపెన్సీతో అన్ని క్లబ్‌లు, రెస్టారెంట్‌లలో సాధారణ వ్యాపారం ఉంటుందని తెలిపారు. అయితే, DJ ఈవెంట్‌లు, న్యూ ఇయర్ పార్టీలను హోస్ట్ చేయడానికి ఎటువంటి అనుమతి ఉండదు. సిబ్బందికి తప్పనిసరి RT-PCR పరీక్షలతో పాటు, ఈ ప్రదేశాల్లోని సిబ్బంది అందరూ రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్‌తో పూర్తిగా టీకాలు వేయాలి "అని ముఖ్యమంత్రి తెలిపారు. కొత్త సంవత్సరం సందర్భంగా గేటెడ్ కమ్యూనిటీలు, భారీ గృహ సముదాయాలు ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
ఎప్పటిలాగే క్రిస్మస్
కోవిడ్ నిబంధనల ప్రకారం అన్ని చర్చిలలో ప్రస్తుతం ప్రార్థనలు, సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు సిఎం బొమ్మై. ఈ సమావేశాలపై ఎటువంటి ఆంక్షలు ఉండవని స్పష్టం చేశారు. కోవిడ్ ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఇన్ని రోజులు చేస్తున్నందున చర్చిలలో ప్రార్థనలు జరుగుతాయని బొమ్మై చెప్పుకొచ్చారు.