అయోధ్య రామ మందిరం నిర్మాణానికి సంబంధించి పనులు చకచక జరుగుతున్నాయి. అయోధ్యలో మందిర నిర్మాణానికి సుమారు రూ.1100 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేసిన రామ జన్మభూమి ట్రస్ట్.. విరాళాల రూపంలో సుమారు రూ.2500 కోట్ల వరకు సమకూరినట్లు ఇప్పటి ట్రస్ట్ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే అయోధ్య రామమందిర నిర్మాణానికి సుమారు రెండువేల కోట్ల విరాళం అందించిన కర్ణాటక ప్రభుత్వం.. గెస్ట్ హౌస్ కోసం మరో పది కోట్ల రూపాయలు అందించేందుకు నిర్ణయం తీసుకుంది.
దీంతో అయోధ్యలో గెస్ట్‌హౌస్ నిర్మించేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందు కోసం రూ.10 కోట్లను కేటాయించింది. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప ఈ విషయాన్ని వెల్లడించారు. కర్ణాటక నిర్మించనున్న గెస్ట్‌హౌస్‌కు ఐదు ఎకరాల స్థలం కూడా ఇవ్వనున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కర్ణాటక నుంచి వెళ్లే యాత్రికులకు అయోధ్య గెస్ట్‌హౌస్ ఎంతగానో ఉపయోగపడుతుందని సీఎం యడ్యూరప్ప తెలిపారు.
ఇప్పటికే తిరుపతిలోనూ యాత్రి నివాస్‌లను కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే తరహాలో అయోధ్యలోని యాత్రికుల కోసం గెస్ట్ హౌస్ నిర్మించనున్నారు. సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వీరశైవ లింగాయత్ వర్గానికి చెందిన బోర్డుకు 500 కోట్లు కేటాయించారు. వొక్కలింగ కమ్యూనికేషన్ కోసం 500 కోట్లతో బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. బ్రాహ్మిణ బోర్డుకు 50 కోట్లు కేటాయించారు. మైనార్టీల కోసం 1500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.