జనవరి 31 వరకు పాఠశాలలు మూసివేత

Karnataka government closes schools from Class 1 to 9 till January 31. 1 నుండి 9 తరగతుల పాఠశాలలను జనవరి 31 వరకు మూసివేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

By అంజి  Published on  13 Jan 2022 5:40 PM IST
జనవరి 31 వరకు పాఠశాలలు మూసివేత

బెంగళూరులోని 1 నుండి 9 తరగతుల పాఠశాలలను జనవరి 31 వరకు మూసివేయనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. నగరంలో వేగంగా కోవిడ్-19 కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే 10 నుంచి 12వ తరగతి విద్యార్థులకు తరగతులు కొనసాగుతాయని, టెక్నికల్ కమిటీ సిఫారసుల తర్వాత దీనిపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.కర్ణాటక సిఎం బసవరాజ్ బొమ్మై కోవిడ్-19కి పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలోనే సీఎం వర్చువల్ మీటింగ్‌ను నిర్వహించాడు. కరోనా కేసుల సంఖ్య ఆధారంగా పాఠశాలలను మూసివేయడంపై చర్యలు తీసుకోవడానికి సంబంధిత జిల్లాల డీసీలకు అధికారం ఇచ్చారు.

10 నుండి 12 తరగతుల పాఠశాలలు, నర్సింగ్, మెడికల్, పారామెడికల్ కళాశాలలు మినహా బెంగళూరులోని అన్ని పాఠశాలలు, కళాశాలలను జనవరి మధ్య వరకు మూసివేయాలని రాష్ట్రం ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు జనవరి నెలాఖరు వరకు పాఠశాలలు మూసివేయాలని ప్రభుత్వం ప్రకటించింది. కర్ణాటకలో కరోనా కొత్త కేసులు 20వేలకు పైగానే నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 93,099 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 10.96%గా ఉంది. బెంగళూరులో 10 వేల కరోనా కేసులు ఉన్నాయి. అందుకే కోవిడ్‌-19కి వ్యతిరేకంగా ప్రోటోకాల్‌లు , జాగ్రత్తలను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

నగరంలో వారాంతపు కర్ఫ్యూను అమలు చేయడం ద్వారా బెంగళూరులో పెరుగుతున్న కేసులను అరికట్టడానికి కర్ణాటక ప్రభుత్వం గతంలో నిషేధాలు విధించింది. కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. బార్‌లు, పబ్బులు, థియేటర్లు 50% సామర్థ్యానికి పరిమితం చేయబడ్డాయి. కర్ణాటక కూడా 15-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు టీకా పథకాన్ని ప్రకటించింది. జనవరి, 2022 చివరి నాటికి గరిష్టంగా పిల్లలకు కనీసం 1 డోస్ టీకాలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Next Story