Video : బ‌స్సు ఆపి నమాజ్ చేసిన డ్రైవ‌ర్‌.. ప్రయాణికులు ఏం చేశారంటే..?

కర్ణాటకలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నమాజ్ చేసేందుకు రోడ్డుపై బస్సును ఆపి సీటుపై నమాజ్ చేయడం ప్రారంభించాడు

By Medi Samrat
Published on : 1 May 2025 11:19 AM IST

Video : బ‌స్సు ఆపి నమాజ్ చేసిన డ్రైవ‌ర్‌.. ప్రయాణికులు ఏం చేశారంటే..?

కర్ణాటకలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నమాజ్ చేసేందుకు రోడ్డుపై బస్సును ఆపి సీటుపై నమాజ్ చేయడం ప్రారంభించాడు. దీంతో ప్రయాణికులు బస్సు డ్రైవర్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ఆ డ్రైవ‌ర్‌ ఇబ్బందుల్లో ప‌డ్డాడు.

వీడియోలో.. డ్రైవ‌ర్‌ బస్సు సీటుపై కూర్చొని నమాజ్ చేయడాన్ని చూడవచ్చు. బస్సులో కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. వారు నిస్సహాయంగా ఇదంతా చూస్తున్నారు. వీడియో వైరల్ కావడంతో విచారణకు ఆదేశించారు.

జవేరి సమీపంలోని హుబ్లీ హవేరీ రోడ్డులో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం ప్రకారం.. కొంతమంది ప్రయాణికులు ఈ సంఘటనపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కర్ణాటక రాష్ట్ర రవాణా సంస్థ దర్యాప్తు ప్రారంభించింది. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఈ విష‌య‌మై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి వాయువ్య కర్ణాటక రోడ్డు రవాణా సంస్థకు లేఖ రాశారు. "ప్రజాసేవలో పనిచేసే ఉద్యోగులు కొన్ని నియమాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి" అని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి తమ మతాన్ని ఆచరించే హక్కు ఉన్నప్పటికీ, పనివేళల్లో తప్ప మిగతా అన్ని సమయాల్లో ఆ పని చేయవచ్చని, బస్సులో ప్రయాణికులు ఉన్నప్పటికీ నమాజ్ చేసేందుకు బస్సును మధ్యలోనే ఆపేయడం అభ్యంతరకరమని మంత్రి తన లేఖలో పేర్కొన్నారు. వైరల్ వీడియోపై తక్షణమే విచారణ జరిపి దోషిగా తేలితే ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Next Story