బెంగళూరులో కమర్షియల్ గ్యాస్ కొరత..కేంద్ర మంత్రికి సీఎం సిద్ధరామయ్య లేఖ

బెంగళూరులో వాణిజ్య గ్యాస్ (LPG) కొరతపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి లేఖ రాశారు.

By -  Knakam Karthik
Published on : 10 March 2026 4:20 PM IST

National News, Karnataka, Bangalore, Siddaramaiah, HardeepSinghPuri, Commercial LPG, Gas Shortage, Central Govt

బెంగళూరులో కమర్షియల్ గ్యాస్ కొరత..కేంద్ర మంత్రికి సీఎం సిద్ధరామయ్య లేఖ

బెంగళూరులో వాణిజ్య గ్యాస్ (LPG) కొరతపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల గృహ వినియోగ గ్యాస్ సరఫరాకు మొదటి ప్రాధాన్యతనిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల లభ్యత గణనీయంగా తగ్గిందని ఆయన పేర్కొన్నారు.

దీనివల్ల నగరంలోని హోటళ్లు, హాస్టళ్లు, మెస్‌లు మరియు ఫంక్షన్ హాళ్ల నిర్వహణ కష్టతరంగా మారిందని, లక్షలాది మంది సామాన్యులపై దీని ప్రభావం పడుతోందని వివరించారు. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి, బెంగళూరులో వాణిజ్య గ్యాస్ సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని కేంద్ర మంత్రిని కోరారు. సామాన్య ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా తగినంత గ్యాస్ నిల్వలు ఉండేలా కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు.

Next Story