మాజీ ముఖ్య‌మంత్రుల కొడుకుల‌ను ఓడించి.. అక్కడ స్వీప్ చేసిన కాంగ్రెస్

కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది. చన్నపట్న, శిగ్గావ్, సండూరు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది.

By Medi Samrat  Published on  23 Nov 2024 3:12 PM IST
మాజీ ముఖ్య‌మంత్రుల కొడుకుల‌ను ఓడించి.. అక్కడ స్వీప్ చేసిన కాంగ్రెస్

కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది. చన్నపట్న, శిగ్గావ్, సండూరు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఓటములతో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు హెచ్‌డి కుమారస్వామి, బసవరాజ్ బొమ్మై చన్నపట్న, షిగ్గావ్ నియోజకవర్గాలలో తమ కుటుంబాల పట్టును కోల్పోయారు.

షిగ్గావ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బసవరాజ్ బొమ్మై కుమారుడు భరత్ బొమ్మై కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్ చేతిలో ఓడిపోయారు. HD కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి చన్నపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు చెందిన యోగేశ్వర్‌ చేతిలో ఓటమికి చవి చూశారు.

ఉప ఎన్నికల్లో మూడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినందుకు శనివారం ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్. తాము ఇచ్చిన హామీలు, కర్ణాటకలో జరుగుతున్న అభివృద్ధి, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వానికి సంబంధించిన విజయమని అన్నారు. బెంగళూరులోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడిన శివకుమార్, రాష్ట్ర అసెంబ్లీలో మా సంఖ్య 138 కి పెరిగిందన్నారు.

Next Story