కర్ణాటక అసెంబ్లీలో మతమార్పిడి నిరోధక బిల్లు పాస్
Karnataka assembly passes contentious anti-conversion bill. కర్నాటక అసెంబ్లీ గురువారం మతమార్పిడి నిరోధక బిల్లును ఆమోదించింది.
By Medi Samrat Published on 23 Dec 2021 1:56 PM GMTకర్నాటక అసెంబ్లీ గురువారం మతమార్పిడి నిరోధక బిల్లును ఆమోదించింది. 'మతస్వేచ్ఛ హక్కు రక్షణ బిల్లు, 2021' ను ప్రతిపక్షాలు వద్దంటున్నా బీజేపీ ప్రభుత్వం పాస్ చేసింది. సమాజంలో సామరస్యాన్ని నెలకొల్పేందుకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బిల్లు ఇదని మంత్రి అశ్వత్నారయణ అన్నారు. "ఇది పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకువస్తుంది. ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను పరిష్కరించే ముందుచూపుతో కూడిన బిల్లు, "అని మంత్రి అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించడంపై వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ తమ వాదనకు మద్దతు ఇచ్చే పత్రాలను కూడా సభ ముందు ఉంచింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య ఈ బిల్లును ఖండించారు.
కర్ణాటక ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ టు రైట్ ఆఫ్ రిలిజియన్ బిల్లు, 2021 పేరుతో ఈ బిల్లును మంగళవారం నాడే రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం పొందిన ఈ బిల్లు మోసపూరితమైనదిగా వర్గీకరించడం ద్వారా ఒక మతం నుండి మరొక మతంలోకి మారడాన్ని నిషేధించాలని కోరింది. ఈ బిల్లు ముసాయిదాలో సామూహిక మత మార్పిడికి పాల్పడే వారికి మూడు నుంచి 10 ఏళ్ల వరకు జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా విధించే నిబంధన తీసుకువచ్చింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా, కనీసం మూడేళ్ల శిక్షను ప్రతిపాదించారు. షెడ్యూల్డ్ కులం (SC) నుండి మైనారిటీగా మారే వ్యక్తి అతను లేదా ఆమె గతంలో అనుభవించిన రిజర్వేషన్‌లతో సహా ప్రభుత్వ ప్రయోజనాలను కోల్పోవల్సి వస్తుంది. మతాంతర వివాహాల విషయంలో, చట్టవిరుద్ధమైన మత మార్పిడి ఉద్దేశ్యంతో చేసిన వివాహాలు రద్దు చేయబడతాయని ముసాయిదా పేర్కొంది.