రంగంలోకి కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి.. క‌ర్ణాట‌క సీఎం ఎవ‌రో తేల‌నుందా..?

Karanataka New CM Updates. క‌ర్ణాట‌క‌కు కొత్త ముఖ్యమంత్రిగా ఎవరొస్తున్నారనే ప్రశ్న ప్రస్తుతం ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌తో పాటు,

By Medi Samrat  Published on  27 July 2021 1:53 PM IST
రంగంలోకి కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి.. క‌ర్ణాట‌క సీఎం ఎవ‌రో తేల‌నుందా..?

క‌ర్ణాట‌క‌కు కొత్త ముఖ్యమంత్రిగా ఎవరొస్తున్నారనే ప్రశ్న ప్రస్తుతం ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌తో పాటు, దేశ వ్యాప్టంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న‌ యడియూరప్ప పదవికి రాజీనామా చేయ‌డంతో ఏర్ప‌డిన ఖాళీని ఎవ‌రు సంపూర్ణంగా పూరించ‌గ‌ల‌ర‌ని కొన్ని ల‌క్ష‌ల మెద‌ళ్లలో క‌దులుతున్న ప్ర‌శ్న‌. ఈ నేఫ‌థ్యంలోనే కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు ఢిల్లీలో బీజేపీ అగ్ర‌నేత‌ల కసరత్తు జరుగుతోంది. త్వరలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చే సత్తా ఉన్న నేతనే సీఎం పీఠం మీద కూర్చోబెట్టాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది.

యడియూరప్ప స్థానంలో కొత్త ముఖ్యమంత్రి పేరును కేంద్రం రెండు రోజుల్లో ప్రకటించనుంది. ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని మంగళవారం ఉదయం ప్రారంభమైన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తీసుకుంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఈ ఉద‌యం క‌ర్ణాట‌క బీజేపీ వ్య‌వ‌హారాల ఇంచార్జ్‌లుగా కేంద్ర‌మంత్రులు కిష‌న్ రెడ్డి, ద‌ర్మేంధ్ర ప్ర‌ధాన్ ల‌ను బీజేపీ నాయ‌క‌త్వం నియ‌మించింది. ఈ నేఫ‌థ్యంలోనే కిష‌న్ రెడ్డి బెంగుళూరు ప‌య‌న‌మ‌య్యారు. అక్క‌డ ఆయ‌న ఎమ్మెల్యేల‌తో స‌మావేశ‌మ‌వనున్నారు. క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా ఎవ‌రిని నియ‌మించ‌నున్నారు..? అన్న ప్ర‌శ్న‌కు కిష‌న్ రెడ్డి స‌మాధాన‌మిస్తూ.. బెంగుళూరు వెళ్తున్నా.. ఎమ్మెల్యేతో స‌మావేశం ఉంది. ఏం జ‌ర‌గ‌నుందో నాకు తెలియ‌దు.. ఎమ్మెల్యేలే నిర్ణ‌యిస్తారని బ‌దులిచ్చారు. ఈ నేఫ‌థ్యంలో త్వ‌ర‌లోనే సీఎం ఎవ‌రో తెలియ‌నుంది.


Next Story