తిరుమలలో కంగనా రనౌత్.. దేవుడిని ఏమని కోరుకుందంటే..

Kangana Ranaut marks new year at tirupati balaji says i want less-police complaintsmore love letters. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తిరుమల

By Medi Samrat  Published on  1 Jan 2022 5:27 PM IST
తిరుమలలో కంగనా రనౌత్.. దేవుడిని ఏమని కోరుకుందంటే..

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. శనివారం(జనవరి 1) ఉదయం 2 గంటలకు వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయకుల మండపంలో కంగనాకు వేద పండితులు ఆశీర్వాదాల అందించారు. అలాగే ఆలయ అర్చకులు పట్టు వస్రాలతో ఆమెను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆమె శ్రీకాళహస్తి ముక్కంటీశ్వరున్ని దర్శించుకుంది. ఈ సందర్భంగా ఆలయాధికారులు ఆమెకు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానికి ముందు ప్రత్యేక రాహుకేతు పూజల్లో పాల్గొంది. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుంది. ఈ సందర్భంగా దేవస్థానం అర్చకులు ఆమెకు ముక్కంటీశుని ప్రసాదాలు, వేదాశీర్వచనాలు అందజేశారు. కంగనా వెంట శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి ఉన్నారు.

శనివారం తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో కంగనా ఒక చిత్రాన్ని పోస్ట్ చేసింది, అందులో ఆమె బంగారు చెవిపోగులతో చీర ధరించి కనిపించి. "అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు... తిరుపతి బాలాజీ ఆశీస్సులతో ఈ సంవత్సరం ప్రారంభం... ఇది మరపురానిది అని ఆశిస్తున్నాను" అని ఆమె క్యాప్షన్ లో చెప్పుకొచ్చింది. ఈ సంవత్సరం తనకు ఎక్కువ ప్రేమ.. తక్కువ పోలీసు ఫిర్యాదులు, ఎఫ్‌ఐఆర్‌లు కావాలని ఆమె అన్నారు. "ప్రపంచంలో ఒకే ఒక రాహుకేతు దేవాలయం ఉంది...ఇది తిరుపతి బాలాజీకి చాలా దగ్గరలో ఉంది....అక్కడ కొన్ని పూజలు చేశాను...చాలా విశేషమైన ప్రదేశం...నా ప్రియమైన శత్రువుల కోసం నేను అక్కడికి వెళ్లాను, ఈ సంవత్సరంలో నాకు తక్కువ పోలీస్ ఫిర్యాదులు / FIRలు మరింత ప్రేమ కావాలి...జై రాహు కేతు జీ కి." అంటూ పోస్టు పెట్టింది కంగనా.


Next Story