Kalyan Singh on life-support, critical. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్(89) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
By Medi Samrat Published on 21 July 2021 9:26 AM GMT
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్(89) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. కల్యాణ్‌సింగ్ కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి వర్గాల వెల్లడించాయి. కల్యాణ్‌సింగ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నెల 4వ తేదీన ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్చారు.
అప్పటి నుంచి కల్యాణ్‌సింగ్ ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు. ఇటీవల బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. జులై 4న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కళ్యాణ్ సింగ్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కల్యాణ్‌సింగ్.. బీజేపీ హయాంలో ఉత్తరప్రదేశ్‌కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014 నుంచి 2019 వరకు రాజస్థాన్‌కు గవర్నర్‌గానూ పనిచేశారు.