లడఖ్ లో కే9 వజ్ర శతఘ్నులను ఉంచిన భారత్

K9-Vajra howitzer regiment inducted in Eastern Ladakh. భారత సరిహద్దుల్లో చైనాను ఎదుర్కోడానికి.. లైన్ ఆఫ్ యాక్టువ‌ల్ కంట్రోల్ వ‌ద్ద

By Medi Samrat  Published on  2 Oct 2021 3:24 PM GMT
లడఖ్ లో కే9 వజ్ర శతఘ్నులను ఉంచిన భారత్

భారత సరిహద్దుల్లో చైనాను ఎదుర్కోడానికి.. లైన్ ఆఫ్ యాక్టువ‌ల్ కంట్రోల్ వ‌ద్ద భారత్ తొలిసారి కే9- వ‌జ్రా హోవిజ్జ‌ర్ గ‌న్నుల‌ను ఉంచింది. కే9-వ‌జ్రా గ‌న్ సుమారు 50 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న శుత్రు టార్గెట్ల‌ను ధ్వంసం చేయ‌గ‌ల‌దని భారత ఆర్మీ తెలిపింది. భారత ఆర్మీ చీఫ్ న‌ర‌వాణే మాట్లాడుతూ భారత ఆర్మీ అధునాతన కే9 వజ్ర శతఘ్నులను రంగంలోకి దించిందని తెలిపారు. లడఖ్ లోని ఫార్వర్డ్ ఏరియాలో తొలిసారి ఈ శతఘ్నులను మోహరించామని అన్నారు. కే9-వ‌జ్రా హోవిజ్జ‌ర్‌కు చెందిన రెజిమెంట్‌ను మొత్తాన్ని ల‌డఖ్‌లో మోహ‌రించిన‌ట్లు న‌ర‌వాణే తెలిపారు.

ఇవి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించే సామర్థ్యం కలిగి ఉన్నాయి. అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో కూడా పనిచేసే సామర్థ్యం కలిగి ఉన్నాయని ట్రయల్స్‌లో రుజువైందని అన్నారు. ప్రస్తుతం కే9 వజ్ర రెజిమెంట్ మొత్తాన్ని ఇక్కడే ఏర్పాటు చేశామని..లడఖ్ వంటి ప్రాంతాల్లో ఈ హోవిట్జర్లు చాలా బాగా ఉపకరిస్తాయని నరవాణే తెలిపారు. వీటిని తొలిసారిగా 2018లో భారత ఆర్మీలో ప్రవేశపెట్టారు. మేక్‌ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఎల్ అండ్ టీ సంస్థ వీటిని గుజరాత్‌లో తయారు చేసింది. ఈ కే9 వజ్ర శతఘ్నులు ఒక్కోటీ 50 టన్నుల బరువు ఉంటాయి. 47 కేజీల బాంబులను విసరగల సామర్థ్యం కలిగి ఉన్నాయి.


Next Story