జైపూర్ ట్యాంకర్ పేలుడు.. 14కు చేరిన మృతులు

జైపూర్-అజ్మీర్ హైవేపై భారీ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది.

By Medi Samrat  Published on  21 Dec 2024 6:25 AM GMT
జైపూర్ ట్యాంకర్ పేలుడు.. 14కు చేరిన మృతులు

జైపూర్-అజ్మీర్ హైవేపై భారీ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 14 మంది ప్రాణాలు కోల్పోగా.. 35 మంది గాయపడినట్లు సమాచారం. వీరిలో 28 మందికి 80 శాతం కాలిన గాయాలయ్యాయి. చాలా మంది వెంటిలేటర్ సపోర్టుపై ఉన్నారు. నిన్న భాంక్రోటా అజ్మీర్ రోడ్‌లో జరిగిన ఎల్‌పిజి ట్యాంకర్ పేలుడుకు కొన్ని మీటర్ల దూరంలో ఉన్న 20కి పైగా వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చాలా మంది మృతదేహాలు కూడా గుర్తుపట్టలేనంత ఘోరంగా త‌యార‌య్యాయని పశ్చిమ జైపూర్ డీసీపీ అమిత్ కుమార్ ఈ మేరకు సమాచారం అందించారు.

చాలా మృతదేహాలను గుర్తించలేకపోవడంతో వాటికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మృతుల డీఎన్‌ఏ నమూనాలను పరీక్షల నిమిత్తం జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రికి పంపారు. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఎల్‌పిజి గ్యాస్‌తో నింపిన ట్యాంకర్ ట్రక్కును ఢీకొట్టింది. ట్యాంకర్‌ యు టర్న్‌ తీసుకుంటుండగా ట్రక్కును ఢీకొనడంతో భారీ పేలుడు సంభవించింది. పేలుడు కిలోమీటరు విస్తీర్ణం మేర ప్ర‌భావం చూపింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు.

Next Story