14 ఏళ్ల బాలిక కడుపులో.. అమ్మో..!

జైపూర్‌లోని వైద్యులు 14 ఏళ్ల బాలిక కడుపు నుండి 210 సెంటీమీటర్ల పొడవున్న ట్రైకోబెజోవర్(వెంట్రుకలు) ను విజయవంతంగా తొలగించి, కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు.

By Medi Samrat
Published on : 31 May 2025 4:43 PM IST

14 ఏళ్ల బాలిక కడుపులో.. అమ్మో..!

జైపూర్‌లోని వైద్యులు 14 ఏళ్ల బాలిక కడుపు నుండి 210 సెంటీమీటర్ల పొడవున్న ట్రైకోబెజోవర్(వెంట్రుకలు) ను విజయవంతంగా తొలగించి, కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. పొడవైన ట్రైకోబెజోవర్‌కు సంబంధించి గతంలో రికార్డు 180 సెంటీమీటర్లు కాగా.. ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టారు.

ఆగ్రాకు చెందిన 10వ తరగతి విద్యార్థిని అయిన బాలిక ఒక నెలకు పైగా కడుపు నొప్పితో బాధపడుతూ ఉంది. ఇటీవల వాంతులు కూడా ఎక్కువయ్యాయి. దీంతో ఆమెను ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరీక్షల్లో వైద్యులు ఆమె కడుపు నుండి నాభి వరకూ, కుడి ఉదరం చుట్టూ ఉన్న ప్రాంతం వరకు విస్తరించి ఉన్న వస్తువును కనుగొన్నారు. కాంట్రాస్ట్ ఎన్‌హాన్స్‌డ్ CT (CECT) స్కాన్‌లో ఆమె కడుపు ఉబ్బిపోయి అసాధారణ వస్తువుతో నిండి ఉందని వెల్లడైంది.

వైద్య బృందం వెంటనే లాపరోటమీ చేయాలని నిర్ణయించుకుంది. వెంట్రుకలను ఒకే ముక్కగా తీయడం ఒక పెద్ద సవాలు. అది కూడా విజయవంతంగా పూర్తీ చేశారు వైద్యులు.

Next Story