భారత ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖర్ విజయం సాధించారు. ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్‌ఖర్ పూర్తి మెజారిటీతో విజయం సాధించారు. జగదీప్ ధన్‌ఖర్ కు 528 ఓట్లు వచ్చాయి. విపక్షాల అభ్యర్థి మార్గరెట్ ఆల్వాకు 182 ఓట్లు వచ్చాయి. పా346 ఓట్ల తేడాతో జగదీప్ ధన్‌ఖర్ విజయం సాధించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 725 మంది ఎంపీలు ఓట్లు వేశారు. ఓటు వేయని వారిలో బీజేపీ ఎంపీలు సన్నీ దియోల్, సంజయ్ ద్రోత్రే ఉన్నారు. టీఎంసీ ఈ ఎన్నికకు దూరంగా ఉన్నప్పటికీ.. ఇద్దరు టీఎంసీ ఎంపీలు ఓట్లు వేశారు. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ జరుగుతూ ఉండగానే ఢిల్లీలో బీజేపీ నేతలు సంబరాలు మొదలుపెట్టారు.