పట్టుబడ్డ ఈ నోట్ల కట్టలను చూశారా..?

IT Raid at Premises of two UP Businessmen. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలో ఇద్దరు వ్యాపారవేత్తలపై ఆదాయపు పన్ను

By Medi Samrat  Published on  24 Dec 2021 4:31 AM GMT
పట్టుబడ్డ ఈ నోట్ల కట్టలను చూశారా..?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలో ఇద్దరు వ్యాపారవేత్తలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో కోట్లాది రూపాయల పన్ను ఎగవేత గుర్తించబడింది. కాన్పూర్, కన్నౌజ్, ముంబై, గుజరాత్‌లోని పెర్ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్ ఇల్లు, ఫ్యాక్టరీ, కార్యాలయం, కోల్డ్ స్టోర్, పెట్రోల్ పంపుపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.

ఐటీ రైడ్‌తో పాటు, నిర్ధిష్ట ఇంటెలిజెన్స్ సమాచారంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ GST ఇంటెలిజెన్స్ (DGGI), అహ్మదాబాద్ అధికారులు గురువారం కాన్పూర్‌లోని ఫ్యాక్టరీ ఆవరణలోనూ, పలు ప్రాంతాల్లోనూ సోదాలు ప్రారంభించారు. ఇ-వే బిల్లులను రూపొందించకుండా, నకిలీ ఇన్‌వాయిస్‌ల ముసుగులో వస్తువుల రవాణాలో ఎవరు పాలుపంచుకున్నారు అనేది నిర్ధారించాల్సి ఉంది. కరెన్సీ కౌంటింగ్ మిషన్‌తో పాటు నగరంలోని పీయూష్ జైన్‌కు చెందిన ఆనంద్‌పురి నివాసానికి ఆదాయపు పన్ను శాఖ బృందం తొలుత చేరుకుంది.

ముంబై, గుజరాత్‌లోని జైన్‌కు చెందిన సంస్థలపై కూడా ఇలాంటి దాడులు జరిగాయి. దాదాపు రూ.150 కోట్ల మేర పన్ను ఎగవేత కేసు తెరపైకి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పన్ను ఎగవేత ప్రధానంగా డొల్ల కంపెనీల ద్వారా జరిగింది. ఆనంద్‌పురి నివాసి అయిన పీయూష్ జైన్ ప్రాథమికంగా కన్నౌజ్‌లోని చిపట్టికి చెందినవాడు. అతనికి కన్నౌజ్‌లో ఇల్లు, పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీ, కోల్డ్ స్టోర్, పెట్రోల్ స్టేషన్ కూడా ఉన్నాయి.

కాన్పూర్, ముంబై మరియు గుజరాత్‌లలో ఏకకాలంలో గురువారం ఉదయం ప్రారంభమైన దాడులు అర్థరాత్రి ముగిశాయి. ఈ దాడుల్లో రూ.150 కోట్ల నగదు దొరికినట్లు సమాచారం. ముంబై బృందం ఈ దాడికి నాయకత్వం వహించింది. ఆ బృందం పర్యవేక్షణలో కాన్పూర్‌లోని ఆదాయపు పన్ను అధికారుల బృందం కూడా దాడులు నిర్వహించింది. ఈ దాడిలో డొల్ల కంపెనీల పేరుతో రుణాలు తీసుకున్న విషయం కూడా వెలుగులోకి వచ్చింది. కంపెనీ విదేశీ లావాదేవీలు కూడా భారీగానే ఉన్నాయి.

''ఆదాయం, పన్నుకు సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్నామని.. ఎస్‌బీఐ అధికారుల సహకారంతో కరెన్సీ నోట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని.. శుక్రవారం నాటికి ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని.. వాటిని సీజ్ చేయనున్నామని మరింత లోతైన విచారణ కొనసాగుతోంది." అని అన్నారు. అదేవిధంగా, ఇ-వే బిల్లులు సృష్టించకుండా, నకిలీ ఇన్‌వాయిస్‌ల ముసుగులో వస్తువులను రవాణా చేస్తున్న ఫ్యాక్టరీ ఆవరణలు, స్థలాలలో కూడా దాడులు నిర్వహించారు. ఫ్యాక్టరీ ఆవరణలో నాలుగు ట్రక్కులను అధికారులు అడ్డుకుని సీజ్ చేశారు. GST చెల్లించకుండా రవాణా కోసం గతంలో ఉపయోగించిన 200 కంటే ఎక్కువ నకిలీ ఇన్‌వాయిస్‌లు రవాణాదారుడి గోదాం నుండి రికవరీ చేయబడ్డాయి.


Next Story