రూ.3 కోట్లు చెల్లించాలని రిక్షా కార్మికుడికి ఐటీ శాఖ నోటీసులు.. ఏం జరిగిందంటే.!

IT department notices rickshaw worker to pay Rs 3 crore. రోజు రిక్షా తొక్కితే గానీ.. పూట గడవని ఓ నిరక్ష్య కార్మికుడికి ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. నోటీసుల్లో రూ.3 కోట్లు

By అంజి  Published on  25 Oct 2021 5:56 AM GMT
రూ.3 కోట్లు చెల్లించాలని రిక్షా కార్మికుడికి ఐటీ శాఖ నోటీసులు.. ఏం జరిగిందంటే.!

రోజు రిక్షా తొక్కితే గానీ.. పూట గడవని ఓ నిరక్ష్య కార్మికుడికి ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. నోటీసుల్లో రూ.3 కోట్లు చెల్లించాలని పేర్కొంది. దీంతో ఆ రిక్షా కార్మికుడు ఒక్కసారిగా షాక్‌ తిన్నాడు. ఈ ఘటన యూపీలోని మధుర జిల్లాలో చోటు చేసుకుంది. మధుర జిల్లాలోని బకాల్‌పూర్‌కు చెందిన రిక్షా కార్మికుడు ప్రతాప్‌ సింగ్‌ బ్యాంకు అకౌంట్‌కు పాన్‌ కార్డు లింక్‌ లేకపోవడంతో... బ్యాంక్‌ అధికారులు పాన్‌కార్డు తీసుకోవాలని చెప్పారు. దీంతో అతడు సువిధ కేంద్రంలోని పాన్‌కార్డు కోసం దరాఖాస్తు చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత పాన్‌ కార్డు వచ్చింది. సంజయ్‌ సింగ్‌ అనే వ్యక్తి పాన్‌కార్డు కలర్‌ ప్రింట్‌ను ప్రతాప్‌ సింగ్‌కు ఇచ్చాడు.

ప్రతాప్‌సింగ్‌కు చదువు రాకపోవడంతో ఒరిజినల్‌ కార్డుకు, కలర్‌ ప్రింట్‌కు తేడా గమనించలేకపోయాడు. అక్టోబర్‌ 19వ తేదీన ఆదాయపు పన్ను అధికారులు రూ.3,47,54,896 చెల్లించాలంంటూ ప్రతాప్‌సింగ్‌కు నోటీసులు ఇచ్చారు. 2018 -19లో తన జీఎస్‌టీ నంబర్‌తో రూ.43,44,36,201 మేర బిజినెస్‌ చేసినందుకు ఈ మొత్తాన్ని చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా కంగుతున్న ప్రతాప్‌ సింగ్‌.. తాను ఓ సాధారణ రిక్షా కార్మికుడినని ఐటీ శాఖ అధికారుల ఎదుట వాపోయాడు. అయితే తన పాన్‌కార్డును ఎవరో తెలియని వ్యక్తి వాడుతున్నాడని పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని అధికారులు సలహా ఇచ్చారు. దీంతో వెంటనే ప్రతాప్‌సింగ్ దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌ కంప్లైంట్‌ ఇచ్చాడు. ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Next Story