నేడే చంద్రయాన్​ -3 ప్రయోగం​.. ఈ సారి పక్కా అంటోన్న ఇస్రో

ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. చంద్రుడిపై అడుగు పెట్టడమే లక్ష్యంగా చంద్రయాన్​ 3 ప్రయోగానికి​కు సర్వం సిద్ధమైంది.

By అంజి  Published on  14 July 2023 1:52 AM GMT
ISRO, Chandrayaan-3, Nationalnews, Research Organisation, Moon,GSLV Mark 3, Lander Vikram

నేడే చంద్రయాన్​ -3 ప్రయోగం​.. ఈ సారి పక్కా అంటోన్న ఇస్రో

ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. చంద్రుడిపై అడుగు పెట్టడమే లక్ష్యంగా చంద్రయాన్​ 3 ప్రయోగానికి​కు సర్వం సిద్ధమైంది. బాహుబలి రాకెట్​లో ఈ చంద్రయాన్​ -3.. శుక్రవారం మధ్యాహ్నం 2గంటల 3 నిమిషాలకు శ్రీహరికోట నుంచి నింగికి దూసుకెళ్‌లనుంది. నిన్న మధ్యాహ్నం 1 గంట 5 నిమిషాలకు చంద్రయాన్​ 3 కౌంట్​డౌన్​ను ఇస్రో ప్రారంభించింది. మార్క్​ 3 (ఎల్​వీఎం3) ఎం4 రాకెట్​లో ఈ చంద్రయాన్​-3ని ప్రయోగించనున్నారు. ఇదొక బాహుబలి రాకెట్, దీనికి 100 శాతం సక్సెట్‌ రేట్‌ ఉంది. చంద్రుడి మీద భారత్​కు ఇది మూడో మిషన్​. శ్రీహరికోట నుంచి మధ్యాహ్నం 2:35 గంటలకు టేకాఫ్​ అవ్వనుంది. ఇస్రో చేస్తున్న ఈ ప్రయోగాన్ని దేశ ప్రజలే కాదు.. యావత్‌ ప్రపంచం ఎంతగానో ఇంట్రెస్ట్‌తో గమనిస్తోంది.

ఈ ప్రయోగంలో మొదటిసారిగా చంద్రుడికి ఆవతవైపు ల్యాండర్‌, రోవర్‌లను పంపనున్నారు. అందుకే ఈ ప్రయోగం ఆసక్తికరంగా మారింది. గత వైఫల్య పాఠాలను దృష్టిలో పెట్టుకున్న ఇస్రో.. ఈ సారి మాత్రం ప్రయోగం విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉంది. 2019 జులై15 చంద్రయాన్‌-2 ప్రయోగం చేసి ఇస్రో విపలమైంది. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి మాత్రం పటిష్టమైన చర్యలు తీసుకుంది. చంద్రునిపై ఉన్న రహస్యా మూట గుట్టు విప్పేందుకే ఇస్రో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. చంద్రయాన్‌-3లో ప్రొపల్షన్‌ మాడ్యుల్‌ 2,145 కిలోలు, ల్యాండర్‌ 1749 కిలోలు, రోవర్‌ 26 కిలోలు ఉంటాయి. దీని బరువు మొత్తం 3,920 కిలోలు. ఈ సారి ఆరు పేలోడ్స్‌ను పంపుతుండగా, అందులో ఒక ఇస్రో పేలోడ్‌ ఉంది.

ప్రపంచంలోని చాలా దేశాలు చంద్రునిపై పరిశోధనలు చేశాయి. కానీ ఎవరూ దక్షిణ ధ్రువం వైపు వెళ్లేదు. కానీ ఇస్రో మాత్రం దక్షిణ ధ్రువంవైపే దృష్టి పెట్టింది. అందుకే చంద్రయాన్‌-3ని కూడా అక్కడికి పంపిస్తోంది ఇస్రో. చంద్రయాన్‌-3 ల్యాండర్‌ను చంద్రుని చీకటి ప్రాంతంలో దించనున్నారు. చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌గా ల్యాండ్ అయ్యేలా చేయడం, రోవర్‌ సరైన విధంగా చంద్రుడిపై తిరిగేలా చేయడం, సైంటిఫిక్ ఎక్స్‌పెరిమెంట్స్‌.. ఈ మిషన్‌ మొదటి లక్ష్యాలు. చంద్రుడిపై సూర్యరశ్మి ఎలా ఉందన్న దానిపై ల్యాండింగ్‌ ఆధారపడి ఉంటుంది. సూర్యరశ్మి ఆలస్యమైతే.. ల్యాండింగ్‌ కూడా లేట్‌ అవుతుంది. అదే జరిగితే ఇస్రో ల్యాండింగ్‌ని సెప్టెంబర్‌కి రీషెడ్యూల్ చేస్తుంది.

ల్యాండింగ్‌కి కనీసం 15 నిముషాల సమయం పడుతుంది. అందుకే...ఇస్రో మాజీ ఛైర్‌పర్సన్ కే శివన్ "15 మినిట్స్ ఆఫ్ టెర్రర్" అని డిఫైన్ చేశారు. ఒక్కసారి సేఫ్‌గా ల్యాండ్ అయిన తరవాత ల్యాండర్ నాలుగు సైంటిఫిక్ పేలోడ్స్‌ని చంద్రుడి ఉపరితలంపై డిప్లాయ్ చేస్తుంది. అవే చంద్రుడిపై ఉన్న వాతావరణ పరిస్థితులను స్టడీ చేస్తాయి. ఈ మాడ్యూల్‌లో షేప్‌ పరికరం అమర్చి ఉంటుంది. భూమి ఎంత కాంతిని రిఫ్లెక్ట్ చేస్తుంది..? ఎంత ఎమిట్ చేస్తోంది..? అనే డేటాని ఈ పరికరం సేకరిస్తుంది. ఇక రోవర్ ప్రగ్యాన్ కెమికల్ టెస్ట్‌ల ద్వారా లూనార్ సర్‌ఫేస్‌పై పరిశోధనలు చేపడుతుంది.

Next Story