మరో సక్సెస్ అందుకున్న ఇస్రో

శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి నిర్వహించిన పీఎస్ఎల్వీ-సి59 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.

By Medi Samrat  Published on  5 Dec 2024 7:26 PM IST
మరో సక్సెస్ అందుకున్న ఇస్రో

శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి నిర్వహించిన పీఎస్ఎల్వీ-సి59 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ-సి59 రాకెట్ ను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించేందుకు, సూర్యుని బాహ్య వలయం కరోనాపై అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం నిర్వహించారు. డిసెంబర్ 4న ఈ ప్రయోగం జరగాల్సి ఉండగా.. చివరి నిమిషంలో సాంకేతిక సమస్య కారణంగా డిసెంబర్ 5 కి వాయిదా పడింది.

ఈ ప్రయోగం విజయవంతమవడంతో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ శాస్త్రవేత్తలను అభినందించారు. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ భాగస్వామ్యంతో ఈ ప్రయోగం చేపట్టినట్లు ఇస్రో తెలిపింది.

Next Story