ఆ రోజే నాకు క్యాన్సర్ ఉన్న విష‌యం తెలిసింది : ఇస్రో చీఫ్ సోమనాథ్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ సమాచారాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు.

By Medi Samrat  Published on  4 March 2024 4:32 PM IST
ఆ రోజే నాకు క్యాన్సర్ ఉన్న విష‌యం తెలిసింది : ఇస్రో చీఫ్ సోమనాథ్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ సమాచారాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆదిత్య-ఎల్1 మిషన్‌ను అంతరిక్షంలోకి పంపిన రోజునే ఈ విషయం నాకు తెలిసిందని ఆయన అన్నారు. ఈ విషయం తెలుసుకున్న త‌ర్వాత‌ సాధారణ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లిన‌ట్లు తెలిపారు.

ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ, "చంద్రయాన్-3 మిషన్ సమయంలో నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి. కానీ నాకు క్యాన్సర్ ఉందని నాకు తెలియదు. పరీక్షల‌లో కడుపు క్యాన్సర్ ఉందని తేలిందని తెలిపారు.

చెన్నైలోని ఓ ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్సను తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. విష‌యం తెలియ‌డంతో కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కీమోథెరపీ కొనసాగింది. చికిత్స తీసుకోవ‌డంతో కోలుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మందులు వాడుతున్నట్లు వెల్ల‌డించారు.

ఇదిలావుంటే.. గగన్‌యాన్ మిషన్‌లో పాల్గొనే నలుగురు వ్యోమగాముల పేర్లను కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. వ్యోమగాములుగా గ్రూప్ కమాండర్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ఈ నలుగురూ భారత వైమానిక దళానికి చెందిన టెస్ట్ పైలట్లు. ఈ మిషన్ కోసం నలుగురూ రష్యా వెళ్లి శిక్షణ పొందారు. ఈ నలుగురు ప్రస్తుతం ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీలో శిక్షణ పొందుతున్నారు.

Next Story