నిజంగానే చంద్రమండలంలో భూమి కొనుక్కోవచ్చా.?

is it possible to buy lunar land. ఈ అనంత విశ్వంలో మానవులు నివసించడానికి అనువైన గ్రహం కేవలం భూమి మాత్రమేనని చెప్పవచ్చు

By Medi Samrat  Published on  31 Dec 2020 11:51 AM GMT
నిజంగానే చంద్రమండలంలో భూమి కొనుక్కోవచ్చా.?

ఈ అనంత విశ్వంలో మానవులు నివసించడానికి అనువైన గ్రహం కేవలం భూమి మాత్రమేనని చెప్పవచ్చు. అయితే ఇతర గ్రహాలపై మానవుల మనుగడకు అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారు. భూమి తర్వాత మానవులు నివసించడానికి అనువైన గ్రహం చంద్ర గ్రహం అని భావిస్తున్నారు. అయితే తాజాగా కొంతమంది చంద్రునిపై భూమి కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగానే చంద్రునిపై భూమిని కొనవచ్చా? చంద్రమండలంపై మానవ మనుగడ సాధ్యమవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా రాజస్థాన్ కి చెందిన ఓ వ్యక్తి తన భార్య పై ఉన్న ప్రేమతో చంద్రునిపై ఏకంగా మూడు ఎకరాల భూమి బహుమతిగా ఇచ్చాడనే ఈ వార్తను మనం చదివే ఉంటాం. కేవలం ఇతను మాత్రమే కాకుండా బోధ్‌గయా వాసి నీరజ్‌ కుమార్‌ తన పుట్టినరోజు కానుకగా చంద్రునిపై ఎకరం పొలం కొన్నానని ప్రకటించాడు. కేవలం సామాన్యులు మాత్రమే కాకుండా దివంగత బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్, షారుక్ ఖాన్ వంటి హీరోలు సైతం చంద్రుడిపై భూమి ఉన్నట్టు తెలిపారు. అయితే నిజంగానే చంద్రమండలంలో భూమిని కొనవచ్చా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే...

చంద్రుని పై స్థలం విక్రయిస్తామని లూనార్ రిజిస్ట్రీ, బే ఆఫ్ రెయిన్ బోస్, సీ ఆఫ్ రేయెన్స్ వంటి సంస్థలు ముందుకు వచ్చాయి. అయితే వీటిలో లూనార్ రిజిస్ట్రీ ద్వారా చంద్రమండలంలో స్థలం కొన్నామని చెబితే దాని అర్థం లూనార్ సేటిల్మెంట్ ఇనిషియేటివ్‌కు క్లెయిమ్ చేస్తున్నారని అర్థం. చంద్రమండలంలో స్థలం కొన్నాను అంటే ఆ డబ్బు ద్వారా చంద్రమండలంపై జరిగే వనరుల అన్వేషణ, పరిష్కారం అభివృద్ధి కోసం వినియోగిస్తారు. అంతకు తప్పితే చంద్రమండలంపై మనం అనుకున్నట్లుగా ఆ వ్యక్తుల పేర్ల పై స్థలం రిజిస్ట్రేషన్ చేయడం వంటివి ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Next Story