ఢిల్లీలో ఐదు వేల మంది పాకిస్థానీలను గుర్తించిన ఇంటెలిజెన్స్ బ్యూరో
పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ కఠినంగా వ్యవహరిస్తుంది.
By Medi Samrat
పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ కఠినంగా వ్యవహరిస్తుంది. పాకిస్థానీలను తమ దేశానికి పంపించే పని జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తానీ పౌరులను తిరిగి పాకిస్తాన్‌కు పంపడం ప్రారంభించాయి. ఢిల్లీలో దాదాపు 5000 మంది పాకిస్థానీ పౌరులను గుర్తించారు. భారత ఇంటెలిజెన్స్ విభాగం తన జాబితాను ఢిల్లీ పోలీసులకు సమర్పించింది.
ఢిల్లీలో నివసిస్తున్న దాదాపు 5000 మంది పాకిస్థానీ పౌరుల జాబితాను IB ఢిల్లీ పోలీసులకు అందజేసింది. తద్వారా వారిని స్వదేశానికి తిరిగి పంపేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది. ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) ఈ జాబితాను ఢిల్లీ పోలీస్ స్పెషల్ బ్రాంచ్‌తో పంచుకుంది.
వార్తా సంస్థ ANI నివేదిక ప్రకారం.. ఈ జాబితాలో దీర్ఘకాలిక వీసా (LTV) ఉన్న హిందూ పాకిస్థానీ పౌరుల పేర్లు ఉన్నాయి. వెరిఫికేషన్ కోసం జాబితా సంబంధిత జిల్లా కేంద్రాలకు అందజేయబడింది. పాకిస్తాన్ పౌరులు తమ స్వదేశానికి తిరిగి వెళ్లాలని కోరిమాని.. జాబితాలో మధ్య, ఈశాన్య జిల్లాల్లో పాకిస్థాన్ జాతీయుల సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు వెల్లడించారు.
ఈ విషయంపై సమావేశం ఏర్పాటు చేశామని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సీనియర్ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీలో నివసిస్తున్న ఈ పాకిస్థానీ జాతీయుల గురించిన సమాచారాన్ని సేకరించి, వీలైనంత త్వరగా భారత్ విడిచి వెళ్లేలా చూడాలని ఢిల్లీ పోలీస్ స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులకు అప్పగించారు.