జమ్మూ కశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా బలగాలు ఈరోజు భగ్నం చేశాయని అధికారులు తెలిపారు. బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్‌లో తెల్లవారుజామున ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారని, అయితే అప్రమత్తమైన బలగాలు వారి ప్రయత్నాలను భగ్నం చేశాయని తెలిపారు. అటవీ ప్రాంతం నుండి వారు భారత్ లోకి చొరబడాలని అనుకోగా.. భారత సైన్యం వారిని అడ్డుకుంది.
ఇరుపక్షాల మధ్య కొద్దిసేపు కాల్పులు జరిగాయి.. ఘటనా స్థలంలో పాకిస్థాన్ నుంచి క్వాడ్‌కాప్టర్(డ్రోన్) కూడా వచ్చినట్లు అధికారులు తెలిపారు. క్వాడ్‌కాప్టర్‌పై భారత సైన్యం కాల్పులు జరపడంతో వెనక్కు వెళ్ళిపోయిందని అధికారులు తెలిపారు. డ్రోన్ లను ఉపయోగించడం చొరబడవచ్చని ఉగ్రవాదులు ప్లాన్ చేయగా.. దాన్ని భారత సైన్యం అడ్డుకుంది.