మహారాష్ట్రలోని పూణేలో ఒక చిన్నారి చేయి అనుకోకుండా లిఫ్ట్ తలుపుల మధ్య ఇరుక్కుపోయింది. అదృష్టవశాత్తూ ఆ బిడ్డకు ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా రక్షించారు. దీనికి సంబంధించిన ఒక షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఈ సంఘటన మార్చి 7న పూణేలోని దిఘి ప్రాంతంలో జరిగింది. ఒక మహిళ శిశువుతో లిఫ్ట్‌లోకి ప్రవేశించింది, మరికొందరు లోపల ఉన్నారు. లిఫ్ట్ తలుపులు మూసుకుపోగా, ఆ శిశువు తన చేతిని తలుపు మీద ఉంచింది. లిఫ్ట్ అనుకున్న అంతస్తుకు చేరుకున్నప్పుడు. తలుపులు తెరిచి మళ్ళీ మూసుకోవడం ప్రారంభించగా శిశువు చేయి తలుపు సందులో చిక్కుకుంది. వెంటనే లిఫ్ట్ లోపల ఉన్న వాళ్లు ఆ పసికందుకు సాయం చేయడానికి ప్రయత్నించారు. శిశువు చేతిని జాగ్రత్తగా తీయడానికి ప్రయత్నించారు. అది మొదట అంత సులభంగా బయటకు రాలేదు. కొన్ని నిమిషాల తర్వాత, శిశువు చేయి చివరకు సురక్షితంగా బయటకు వచ్చింది.