ప్రముఖ పారిశ్రామిక వేత్త రాహుల్ బజాజ్ ఇక లేరు

Industrialist Rahul Bajaj passes away at 83. బజాజ్ ఆటో అంటే గుర్తుకు వచ్చే పేరు రాహుల్ బజాజ్. ఇప్పుడు ఆయన మనతో పాటూ లేరు

By Medi Samrat  Published on  12 Feb 2022 4:51 PM IST
ప్రముఖ పారిశ్రామిక వేత్త రాహుల్ బజాజ్ ఇక లేరు

బజాజ్ ఆటో అంటే గుర్తుకు వచ్చే పేరు రాహుల్ బజాజ్. ఇప్పుడు ఆయన మనతో పాటూ లేరు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ బజాజ్ తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఆయన పూణెలో మరణించారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. బజాజ్ గ్రూప్ నుండి ఒక ప్రకటనలో ఆయన సన్నిహిత కుటుంబ సభ్యుల సమక్షంలో మరణించారని తెలిపారు. రాహుల్ బజాజ్ గతేడాది ఏప్రిల్‌లో బజాజ్ ఆటో చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆయన్ను ఐదేళ్లపాటు సంస్థకు ఎమెరిటస్‌గా నియమించబడ్డారు.

భారతీయ కార్పొరేట్ పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధ ట్యాగ్‌లైన్‌లలో "you just can't beat a Bajaj", "Hamara Bajaj" చాలా ఫేమస్. బజాజ్ కంపెనీకి చెందిన టూ వీలర్ సేల్స్ ఈ ట్యాగ్ లైన్స్ ద్వారా భారీగా పెరిగాయి. ఆయన మరణ వార్త విని పలువురు ప్రముఖులు షాక్ అయ్యారు. రాహుల్ బజాజ్ కు 2001లో పద్మభూషణ్ అవార్డు లభించింది. "It is with deep sorrow that I inform you about the passing away of Shri Rahul Bajaj, husband of the late Rupa Bajaj and father of Rajiv/Deepa, Sanjiv/Shefali and Sunaina/Manish. He passed away on the afternoon of 12th February, 2022 in the presence of his closest family members," అంటూ బజాజ్ సంస్థ ట్వీట్ పెట్టింది.

రాహుల్ బజాజ్‌కు న్యుమోనియా, గుండె సమస్య కూడా ఉంది. ఆయన గత నెల రోజులుగా ఆసుపత్రిలో చేరినట్లు రూబీ హాల్ క్లినిక్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ పూర్వేజ్ గ్రాంట్ తెలిపారు. రాహుల్ బజాజ్ ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు తుది శ్వాస విడిచారు. జూన్ 10, 1938న జన్మించిన రాహుల్ బజాజ్ బజాజ్ గ్రూప్‌కు 40 ఏళ్లకు పైగా ఛైర్మన్‌గా వ్యవహరించారు. రాహుల్ బజాజ్ గత ఏడాది ఏప్రిల్‌లో బజాజ్ ఆటో ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం సంస్థ యొక్క ఎమిరిటస్ ఛైర్మన్‌గా ఉన్నారు. బజాజ్ రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు.


Next Story