గడ్డకట్టే చలిలో.. గణతంత్ర దినోత్సవ వేడుకలు.. వీడియో

Indo-Tibetan Border Police celebrate RepublicDay. భారతదేశం ఈరోజు 73వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. మైనస్‌ 35 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో.. ఇండో, టిబెటియన్‌ బార్డర్‌

By అంజి  Published on  26 Jan 2022 3:28 AM GMT
గడ్డకట్టే చలిలో.. గణతంత్ర దినోత్సవ వేడుకలు.. వీడియో

భారతదేశం ఈరోజు 73వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. మైనస్‌ 35 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో.. ఇండో, టిబెటియన్‌ బార్డర్‌ సరిహద్దులో భారత జవాన్లు గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండాతో కవాతు చేశారు. గడ్డకట్టే చలిలో జాతీయ జెండాను రెపరెపలాడించారు. అలాగే ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ సిబ్బంది లడఖ్‌లో -40 డిగ్రీల సెల్సియస్‌లో 17,500 అడుగుల ఎత్తులో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఇదిలా ఉంటే నేపాల్ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారీ, పీఎం షేర్ బహదూర్ దేవుబా, విదేశాంగ మంత్రి నారాయణ్ ఖడ్కా 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సంవత్సరం ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో 16 కవాతు బృందాలు, 17 మిలటరీ బ్యాండ్‌లు, వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, విభాగాలు మరియు సాయుధ దళాల 25 టేబులాక్స్ ఉంటాయి. భారతదేశ సైనిక శక్తి, సాంస్కృతిక వైవిధ్యం ప్రదర్శించబడుతుంది. ఈ సంవత్సరం రిపబ్లిక్ డే ఈవెంట్ 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని కేంద్రం యొక్క ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగం. కోవిడ్ ఆందోళనల కారణంగా, ఢిల్లీ పోలీసులు 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను, రెండు డోసుల టీకాలు వేయని వ్యక్తులను ఈ సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్‌కు హాజరు కాకుండా నిరోధించారు.


Next Story