సేవలు సాధారణ స్థితికి వచ్చాయి..ఇబ్బందులకు క్షమాపణ కోరుతున్నాం: ఇండిగో సీఈవో
ఇండిగో సేవలు సాధారణ స్థితికి వచ్చాయని..ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ ప్రకటించారు.
By - Knakam Karthik |
సేవలు సాధారణ స్థితికి వచ్చాయి..ఇబ్బందులకు క్షమాపణ కోరుతున్నాం: ఇండిగో సీఈవో
ఢిల్లీ: ఇండిగో సేవలు సాధారణ స్థితికి వచ్చాయని..ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఇండిగో సంస్థ అధికారిక ఎక్స్ ఖాతాలో మాట్లాడిన వీడియో ద్వారా తెలియజేశారు. అత్యవసర పనుల మీద వెళ్లే వేలమంది ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు, దానికి మేము క్షమాపణ కోరుతున్నాము. ఇక మీదట ఇండిగో విమాన సేవల్లో ఎటువంటి అసౌకర్యం కలగదు. మెరుగైన సేవలు అందించేందుకు ఇండిగో సిబ్బంది అంత కష్టపడి పని చేస్తున్నారు, ఇండిగో ప్రయాణికులే మాకు మొదటి ప్రాధాన్యత. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే లక్షలాది ప్రయాణికులకు పూర్తి రిఫండ్ చెల్లించాము..అని పీటర్ ప్రకటించారు.
ఇక ప్రయాణికుల బ్యాగేజీలు వారి నివాసాలకు చేర్చాము. మిగిలిన మరికొన్ని బ్యాగేజీలను వారి నివాసాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేశాం. డిసెంబర్ 5 తేదీన 700 ఫ్లైట్లు మాత్రమే నడపగలిగాము. నిన్న, ఈరోజు మొత్తం 18 వందల ఫ్లైట్లను అందుబాటులోకి తెచ్చాం . 138 గమ్య స్థానాలకు ఇండిగో ప్రయాణాలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ పూర్తి సహకారంతో ముందుకు వెళ్తున్నాం..అని ఇండిగో సీఈవో వివరణ ఇచ్చారు.
IndiGo Operations Normalised | A Message From Pieter Elbers, CEO, IndiGo pic.twitter.com/VVB2yTsIBy
— IndiGo (@IndiGo6E) December 9, 2025