ఇండిగో విమాన సర్వీసుల్లో అనుకోని అడ్డంకులు

దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల్లో అడ్డంకులు ఎదురయ్యాయి. దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌లో 70కి పైగా ఇండిగో విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.

By -  Medi Samrat
Published on : 3 Dec 2025 8:30 PM IST

ఇండిగో విమాన సర్వీసుల్లో అనుకోని అడ్డంకులు

దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల్లో అడ్డంకులు ఎదురయ్యాయి. దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌లో 70కి పైగా ఇండిగో విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. సాంకేతిక సమస్యలతో ఇండిగో సర్వీసులు రద్దు చేశారు. శంషాబాద్‌ నుంచి వెళ్లాల్సిన 13 విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాంకేతిక లోపాలు, రద్దీ, ఆపరేషనల్ సమస్యలు, సిబ్బంది కొరత కారణమని అధికారులు తెలిపారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో చెక్ ఇన్ సిస్టమ్ లో సాంకేతిక లోపంతో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.

దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో గత కొన్ని రోజులుగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంది. విమానాల అంతరాయాల కారణంగా దెబ్బతిన్న అనేక మంది ప్రయాణికులు సోషల్ మీడియా ద్వారా ఆలస్యం, ప్రయాణాల రద్దుపై తమ నిరాశను వ్యక్తం చేశారు.

Next Story