దేశంలోనే తొలిసారిగా మంకీపాక్స్ సోకిన వ్యక్తి ఇప్పుడు ఎలా ఉన్నాడంటే..

Indias first Monkepox Patient Recovers to be Discharged. దేశంలోనే తొలిసారిగా మంకీపాక్స్ సోకిన వ్యక్తి పూర్తిగా కోలుకున్నాడని

By Medi Samrat  Published on  30 July 2022 11:44 AM GMT
దేశంలోనే తొలిసారిగా మంకీపాక్స్ సోకిన వ్యక్తి ఇప్పుడు ఎలా ఉన్నాడంటే..

తిరువనంతపురం: దేశంలోనే తొలిసారిగా మంకీపాక్స్ సోకిన వ్యక్తి పూర్తిగా కోలుకున్నాడని, డిశ్చార్జ్ చేస్తామని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ శనివారం ప్రకటించారు. 35 ఏళ్ల కేరళకు చెందిన వ్యక్తి జూలై 12న యుఎఇ నుండి భారత్ కు వచ్చాడు. రెండు రోజుల తరువాత పరీక్షలు చేయగా వైరస్ పాజిటివ్ అని వచ్చింది. అతనిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించగా.. అతన్ని కొల్లంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుండి అతన్ని త్రివేండ్రం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడికి ట్రీట్మెంట్ ఇచ్చారు. "పూర్తి చికిత్స ప్రోటోకాల్‌ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పూణే చూసుకుంది. పదేపదే అతడి నమూనాలను తీసుకొని పరీక్షించారు నిపుణులు" అని చెప్పుకొచ్చారు.

అతని తల్లిదండ్రులతో పాటూ అతడికి సన్నిహిత సంబంధాలు, అతనితో పాటు ప్రయాణించిన మరో 11 మంది ప్రయాణికులపై ఆందోళనలు తలెత్తాయి. ఆరోగ్య అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు ఎలాంటి ఆందోళన అవసరం లేదని హామీ ఇచ్చారు. మిడిల్ ఈస్ట్ నుండి కేరళకు వచ్చిన వారిలో మరో రెండు పాజిటివ్ కేసులు ఉన్నాయని... వారు వేగంగా కోలుకుంటున్నాయని జార్జ్ చెప్పారు.

ఇండియాలో మంకీపాక్స్ వైర‌స్ రకం యూరోపియ‌న్ ర‌కంతో పోలీస్తే భిన్నంగా ఉంద‌ని సైంటిస్టులు క‌నుగొన్నారు. పుణెలోని ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చ్ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీ శాస్త్రవేత్త‌లు, రెండు ర‌కాల వైర‌స్ జ‌న్యుక్ర‌మాన్ని విశ్లేషించారు. ప్ర‌స్తుతం ఇండియాలోని మంకీపాక్స్ వైర‌స్ ఏ.2 ర‌కానికి చెందిన‌దిగా గుర్తించారు. ఇది మిడిల్ ఈస్ట్ నుంచి భార‌త్ కు వ‌చ్చింది. అంత‌కు ముందు ఈ ర‌కం థాయ్ లాండ్‌, యూఎస్ లో 2021 లో వ్యాధి వ్యాప్తికి కార‌ణం అయ్యిందని శాస్త్రవేత్త‌లు గుర్తించారు.













Next Story