దేశంలో కోటి దాటిన క‌రోనా కేసులు

India's Corona case count crosses 1 crore mark. దేశంలో కొత్త‌గా గడిచిన 24గంటల్లో 25,153 కరోనా పాజిటివ్‌ కేసులు

By Medi Samrat  Published on  19 Dec 2020 10:18 AM IST
దేశంలో కోటి దాటిన క‌రోనా కేసులు

దేశంలో కొత్త‌గా గడిచిన 24గంటల్లో 25,153 కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. దీంతో దేశంలో మొత్తం క‌రోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య కోటి మార్క్‌ను దాటింది. దీంతో అమెరికా తర్వాత కోటి కరోనా‌ కేసులను దాటిన రెండో దేశంగా భారత్‌ నిలిచింది. ఇక‌, జనవరి 30న కేరళలో తొలికేసు నమోదవ‌గా.. నేడు కోటికి చేరింది. కాగా, అప్ప‌టి నుంచి ఇప్పటి వ‌ర‌కు 95.5లక్షల మంది కోలుకున్నారు.

తాజాగా దేశంలో మ‌రో 347 మంది వైరస్‌కు బలవగా.. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,45,136కు చేరింది. తాజాగా 29,885 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 95,50,712 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 3,08,751 యాక్టివ్‌ కేసులున్నాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.

ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 95.46శాతంగా ఉందని, మరణాల రేటు 1.45శాతంగా ఉందని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 16కోట్లకుపైగా కరోనా నమూనాలను పరిశీలించ‌గా.. శుక్రవారం ఒకే రోజు 11,71,868 శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. ఇప్పటి వరకు 16,00,90,154 నమూనాలను పరీక్షించినట్లు వివరించింది.


Next Story