India's 1st COVID-19 Patient Tests Positive For Coronavirus Again. భారత్ లో కరోనా సోకిన తొలి పేషెంట్ మళ్లీ ఆ వైరస్ బారిన పడింది.
By Medi Samrat Published on 13 July 2021 10:36 AM GMT
భారత్ లో కరోనా సోకిన తొలి పేషెంట్ మళ్లీ ఆ వైరస్ బారిన పడింది. చైనాలోని మెడికల్ కాలేజ్‌లో చదువుతున్న కేరళలోని త్రిసూర్‌కు చెందిన విద్యార్థిని దేశంలో తొలి కరోనా పేషెంట్‌గా నిలవగా.. ఆమెకు తాజాగా మరోసారి పాజిటివ్‌గా తేలినట్లు ఆరోగ్య అధికారి వెల్లడించారు. ఆమెలో కరోనా లక్షణాలేమీ కనిపించలేదు. ఢిల్లీకి వెళ్దాలనుకుని ఇటీవల కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. ఆమె ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కరోనా వ్యాక్సిన్ తొలి డోసు ఆమె తీసుకున్నట్లు చెప్పారు.
2020 జనవరిలో ఆమెకు కరోనా సోకింది. దీంతో నెల రోజుల పాటు హాస్పిటల్‌లో ఉండి చికిత్స తీసుకుంది. ఆ తర్వాత ఆమెతోపాటు వుహాన్‌కు వెళ్లిన మరో ఇద్దరు స్నేహితురాళ్లకు కూడా పాజిటివ్‌గా తేలింది. గతేడాది జనవరి 27నుంచి ఫిబ్రవరి 20 వరకు ఆమె 24 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంది. భారతదేశపు మొట్టమొదటి కరోనా రోగి అయిన సదరు మహిళ మెడికో..! వైరస్ కోసం మళ్లీ పాజిటివ్ పరీక్ష తీసుకున్న ఆమెకు కరోనా సోకిందని త్రిసూర్ అధికారులు తెలిపారు. ఆమెకు మళ్లీ కరోనా సోకిందంటూ త్రిస్సూర్ జిల్లా వైద్య అధికారి డాక్టర్ కెజె రీనా వార్తా సంస్థ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాతో అన్నారు.