బ్రేకింగ్‌.. ఉక్రెయిన్‌లో భార‌త విద్యార్థి మృతి

Indian student dies in shelling in Ukraine's Kharkiv.ఉక్రెయిన్‌లో ర‌ష్యా జ‌రుపుతున్న దాడుల్లో భార‌తీయ విద్యార్థి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 March 2022 3:30 PM IST
బ్రేకింగ్‌.. ఉక్రెయిన్‌లో భార‌త విద్యార్థి మృతి

ఉక్రెయిన్‌లో ర‌ష్యా జ‌రుపుతున్న దాడుల్లో భార‌తీయ విద్యార్థి మ‌ర‌ణించాడు. మంగ‌ళ‌వారం ఉద‌యం తూర్పు ఉక్రెయిన్‌లోని ఖార్కీవ్‌లో ర‌ష్యా జ‌రిపిన బాంబు దాడిలో భార‌త విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విష‌యాన్ని కేంద్ర విదేశాంగ శాఖ అధికారికంగా ప్ర‌క‌టించింది.

మృతి చెందిన విద్యార్థిని క‌ర్ణాట‌క రాష్ట్రం హ‌వేరీ జిల్లా చ‌లగేరికి చెందిన న‌వీన్ శేఖ‌ర‌ప్ప‌గా గుర్తించారు. ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో అత‌డు మెడిసిన్ చదువుతున్నాడు. అందుతున్న స‌మాచారం ప్ర‌కారం త‌న న‌వీన్ త‌న అపార్ట్‌మెంట్ నుంచి రైల్వే స్వేష‌న్‌కు వెలుతుండ‌గా.. క్షిప‌ణి దాడిలో ప్రాణాలు కోల్పోయాడు.


విద్యార్థి కుటుంబంతో టచ్‌లో ఉన్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది. "ఈ ఉదయం ఖార్కివ్‌లో జరిగిన షెల్లింగ్‌లో భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని మేము తీవ్ర విచారంతో ధృవీకరిస్తున్నాము. మంత్రివర్గం అతని కుటుంబంతో టచ్‌లో ఉంది. కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం' అని MEA అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.

ర‌ష్యా, ఉక్రెయిన్ రాయ‌బారుల‌తో విదేశాంగ శాఖ కార్య‌ద‌ర్శి మాట్లాడుతున్నారు. భార‌తీయులంద‌ర్నీ సుర‌క్షితంగా త‌ర‌లించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈ రెండు దేశాల్లోని రాయ‌బారులు కూడా ఇదే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు అరిందమ్ బాగ్చి చెప్పారు.


Next Story