గుడ్ న్యూస్ చెప్పిన ఇండియన్ రైల్వే ..
Indian Railways may open up all passenger services in April. రైలు ప్రయాణీకులకు శుభవార్త.. కరోనా మహమ్మారి కారణంగా
By Medi Samrat Published on 13 Feb 2021 4:30 PM ISTభారతీయ రైల్వే తన మొదటి ఎయిర్ కండీషన్డ్ త్రీ టైర్ ఎకానమీ క్లాస్ కోచ్‌ను ప్రారంభించింది. ప్రపంచంలోకెల్లా అత్యంత చౌకైన, ఉత్తమమైన ఏసీ ప్రయాణాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో దీన్ని ప్రారంభించారు. ఈ కోచ్‌లలో ఛార్జీలు ఏసీ త్రీ-టైర్, నాన్- ఏసీ స్లీపర్ క్లాస్ మధ్య ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. రైళ్లలో ఈ నూతన ఎస్3 టైర్ ఎకానమీ కోచ్‌లను చేర్చడం ద్వారా ప్రస్తుతం 72గా ఉన్న బెర్త్‌ల సంఖ్య 83కి పెరగనుంది. తద్వారా ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకెళ్లే సౌలభ్యం కలుగుతుంది. ప్రతి కోచ్‌లో మోడరన్ డిజైన్‌తో రూపొందించిన సీట్లు, బెర్తులను చేర్చింది. ఫోల్డబుల్ స్నాక్ టేబుల్స్, వాటర్ బాటిల్స్, మొబైల్ ఫోన్, మ్యాగజైన్‌ల కోసం ప్రత్యేక హోల్డర్లను ఏర్పాటు చేసింది.
స్టాండర్డ్ సాకెట్‌తో పాటు ప్రతి బెర్త్‌కు వ్యక్తిగత రీడింగ్ లైట్లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లను ఉంచింది. మధ్య, ఎగువ బెర్తులను యాక్సెస్ చేయడానికి నిచ్చెనలో ఎర్గోనామిక్‌గా మెరుగైన డిజైన్‌ను కూడా అందించింది. మధ్య, ఎగువ బెర్తులలో హెడ్‌రూమ్‌ను పెంచింది. ప్రస్తుతం వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం 248 రైళ్లలో ఎసి3 టైర్ ఎకానమీ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌సిఎఫ్ స్పష్టం చేసింది. ఈ కోచ్‌ల ఉత్పత్తి ఈ నెల నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. ఇది ప్రయాణికుల సంఖ్య పెరగడానికి, ఎక్స్‌ప్రెస్ రైళ్ల సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందని రైల్వే శాఖ స్పష్టం చేసింది.
ఇక ఇండియన్ రైల్వేస్, ది ప్రైడ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇకపై రైల్వే ప్రయాణికులు దేశంలోని అన్ని ప్రైడ్ గ్రూప్ హోటళ్లలో గదులను IRCTC ద్వారా బుక్ చేసుకోవచ్చు. ప్రైడ్ హోటల్స్ లగ్జరీతో కూడుకున్నవి. అందువల్ల ప్రయాణికులకు అత్యంత సురక్షితమైన స్టే లభిస్తుందని భారత రైల్వే చెబుతోంది. ఇందుకు సంబంధించి ప్రైడ్ హోటల్స్ గ్రూప్ ఓ ప్రెస్ రిలీజ్ ఇచ్చింది. ఇకపై ప్రయాణికులు తమ ట్రైన్ టికెట్‌తో పాటే హోటల్ రూం కూడా బుక్ చేసుకోవచ్చని తెలిపింది.