ఇండియన్ నేవీ యొక్క 1971 ఇండో-పాక్ యుద్ధ అనుభవజ్ఞుడైన వైస్ అడ్మిరల్ ఎస్.హెచ్. శర్మ 100 సంవత్సరాల వయస్సులో 2022, జనవరి 3 సోమవారం మరణించినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. శర్మ 1971 యుద్ధంలో తూర్పు నౌకాదళానికి కమాండింగ్ ఫ్లాగ్ ఆఫీసర్. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసిన 1971 యుద్ధంలో భారత్ పాకిస్థాన్‌ను ఓడించింది. ఈస్టర్న్ నేవల్ కమాండ్‌కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ (ఎఫ్‌ఓసి ఇన్ సి)గా కూడా శర్మ పనిచేశారని అధికారులు తెలిపారు. భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం 6.20 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని మంగళవారం ఆయన నివాసానికి తరలించనున్నట్లు, అక్కడ ప్రజలు ఆయనకు నివాళులర్పిస్తారని ఆయన కుటుంబసభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 5న అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
వైస్ అడ్మిరల్ శర్మ గతేడాది డిసెంబర్ 1న తన 100వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో కూడా ఆయన పాల్గొన్నారు. అయితే ఆ రోజు శర్మకు 99 ఏళ్లు నిండాయని నేవీ అధికార ప్రతినిధి తెలిపారు. వైస్ అడ్మిరల్ ఎస్.హెచ్. శర్మ మృతి పట్ల ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం ప్రకటించారు. ఆయన మరణించిన వార్త తెలుసుకోవడం చాలా బాధగా ఉందన్నారు. భారతదేశం చేసిన అనేక యుద్ధాలలో అనుభవజ్ఞుడైన సైనికుడు వైస్ అడ్మిరల్ ఎస్.హెచ్. శర్మ ముందు నుండి నాయకత్వం వహించారని పేర్కొన్నారు.
వైస్ అడ్మిరల్ ఎస్.హెచ్. శర్మ మృతికి సంతాపం తెలుపుతూ.. భువనేశ్వర్‌లోని స్టేషన్ హెచ్‌క్యూ, 120 బెటాలియన్, కెప్టెన్ సంజీవ్ వర్మ ఒక సందేశంలో ఇలా అన్నారు. "అతను ఎల్లప్పుడూ మాకు స్ఫూర్తిదాయకంగా ఉండేవాడు. బేలో భారతదేశ విజయానికి వ్యూహరచన చేయడంలో ఈస్టర్న్ నేవల్ కమాండ్ సిలో ఎఫ్‌ఓసిగా అతనిది కీలక పాత్ర."