ఐఎన్‌ఎస్ విశాఖపట్నం నౌక రేపు (నవంబర్ 21వ తేదీన) జల ప్రవేశం చేయనుంది. ప్రాజెక్టు -15బీలో భాగంగా ఐఎన్‌ఎస్ విశాఖపట్నం నౌకను నిర్మించారు. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఈ కార్యక్రమం జరగనుంది. నేవల్ డాక్‌యార్ట్‌లో జరిగే కమీషన్ వేడుకకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరుకానున్నారు. అలాగే ఈ నెల 28న కల్వరి క్లాస్ సబ్ మెరైన్ వెలా నాలుగో సబ్‌మెరైన్ జల ప్రవేశం చేయనుంది. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ పాల్గొననున్నారు. ఐఎన్‌ఎస్ విశాఖపట్నం కమీషనింగ్ కోసం సిద్ధంగా ఉన్నామని ఐఎన్‌ఎస్ కమాండింగ్ ఆఫీసర్ కెప్టెన్ బీరేంద్ర సింగ్ తెలిపారు. ఐఎన్‌ఎస్ విశాఖపట్నం నౌకు డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ చేసింది. కాగా దీనిని ముంబైలోని మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ తయారు చేసింది.
ప్రాజెక్టు-15బీలో భాగంగా మొత్తంగా నాలుగు నౌకలు నిర్మించారు. ఇక వీటికి దేశంలోని నాలు ప్రధాన నగరాలు అయిన విశాఖపట్నం, మోర్ముగావ్, ఇంఫాల్, సూరత్ పేర్లు పెట్టారు. ఇక భారత అమ్ములపొదిలో శక్తివంతమైన ఆయుధంగా వేలా కల్వరి క్లాస్ నాల్గో జలాంతర్గామి నిలవనుంది. కమీషన్ వేడుకలు, 'ఆజాదికా అమృతమహోత్సవ్', 'స్వర్ణిం విజయ్ వర్ష్' వేడుకలతో సమానంగా ఉంటాయి. విశాఖపట్నం , వేలా ప్రవేశాలు మన రక్షణ సంసిద్ధతను పెంచడమే కాకుండా 1971 యుద్ధంలో దేశ స్వాతంత్ర్యం కోసం మన స్వాతంత్ర్య సమరయోధులు, మన వీర సైనికులు చేసిన త్యాగాలకు ఇది ఘనమైన నివాళి అని భారత నౌకాదళం పేర్కొంది.